క్రీడాభూమి

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శుభ్‌మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనుయ్ (న్యూజిలాండ్), ఫిబ్రవరి 3: అండర్-19 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న నాలుగో భారతీయుడు శుభ్‌మన్ గిల్. ఇంతకు ముందు 2000లో యువరాజ్ సింగ్, 2004లో శిఖర్ ధావన్, 2006లో చటేశ్వర్ పుజారా ఈ అవార్డును స్వీకరించారు.
1988లో మొదటిసారి అండర్-19 వరల్డ్ కప్ జరిగింది. పదేళ్ల తర్వాత, 1998లో రెండోసారి ఈ టోర్నీని నిర్వహించారు. ఈ రెండు పర్యాయాలు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇవ్వలేదు. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్‌లో 1988లో బ్రెట్ విలియమ్స్, 1998లో స్టెఫెన్ పీటర్స్ ఎంపికయ్యారు. 2000 మొదటిసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్రకటించగా, యువరాజ్ సింగ్ దానిని దక్కించుకున్నాడు. ఆ టోర్నీలో రీతీందర్ సోధీకి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు లభించింది. మొత్తం మీద ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్/ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గ్రహీతలు వీరే..
ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్: 1998: బ్రెక్ విలిమియమ్స్ 1998: స్టెఫెన్ పీటర్స్, 2000: రీతీందర్ సోధీ, 2002: ఆరోన్ బర్డ్, 2004: ఆసిఫ్ ఇక్బాల్, 2006: అన్వర్ అలీ, 2008: అజితేష్ అర్గల్, 2010: జొష్ హాజెల్‌వుడ్, 2012: ఉన్ముక్త్ చాంద్, 2014: కొర్బిన్ బొచ్, 2016: సర్బజిత్ బనువా, 2018: మన్‌జోత్ కల్రా.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: 2000: యువరాజ్ సింగ్, 2002: టటెండ టైబూ, 2004: శిఖర్ ధావన్, 2006: చటేశ్వర్ పుజారా, 2008: టిమ్ సౌథీ, 2010: డామినిక్ హెండ్రిక్స్, 2012: విల్ బొసిస్టో, 2014: అయిడెన్ మర్‌క్రామ్, 2016: మెహదీ హసన్ మీర్జా, 2018: శుభ్‌మాన్ గిల్.