క్రీడాభూమి

టైమింగ్స్ మారిస్తే ఐపీఎల్ బహిష్కరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు జరిగే సమయాలను మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతున్నది. టైమింగ్స్ మారిస్తే ఐపీఎల్‌నే బహిష్కరిస్తామని ఫ్రాంచైజీలు బీసీసీఐకి అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం.
పేరు చెప్పడానికి ఇష్టపడని బోర్డు అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ మ్యాచ్‌ల ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ ఇండియా సంస్థ కోరిక మేరకే మ్యాచ్‌లు జరిగే సమయాలను బీసీసీఐ మార్చిందని చెప్పాడు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే డే/నైట్ మ్యాచ్‌లు ఈ ఏడాది రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటలకు మొదలు కావాల్సిన డే మ్యాచ్‌లను గంటన్నర ఆలస్యంగా, సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ స్టార్ చానెళ్లలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని, మ్యాచ్‌లు జరిగే సమయాలను మార్చాలన్న సూచనకు బీసీసీఐ తలవంచింది. అయితే, చానెళ్ల డిమాండ్ మేరకు ఇలాంటి మార్పులు చేసుకుంటూపోతే, టోర్నమెంట్‌కు విలువ ఉండదని వివిధ ఫ్రాంచైజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని పీటీఐతో మాట్లాడిన బోర్డు అధికారి తెలిపాడు. మార్పులు అనివార్యమైతే, ఐపీఎల్‌ను బహిష్కరించాలన్న ఆలోచన కూడా ఫ్రాంచైజీలకు లేకపోలేదని అన్నాడు. ఈ వార్తలో నిజానిజాలు ఎలావున్నా, సమయాలు మారినప్పుడు సహజంగానే దాని ప్రభావం అటు ఆటగాళ్లపైన, ఇటు ప్రేక్షకులపైన పడుతుంది. స్టార్ డిమాండ్ మేరకు బీసీసీఐ సమయాలను మారుస్తుందో లేక ఫ్రాంచైజీల కోరిక మేరకు పాత షెడ్యూల్‌నే అమలు చేస్తుందో చూడాలి.