క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు శివ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వియాన్ (చైనా), మార్చి 31: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను శివ్ ధాపా సంపాదించగా, ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, టాప్ సీడ్ మేరీ కోమ్‌కు నిరాశ తప్పలేదు. రియోకు ఆమె క్వాలిఫై కాలేకపోయింది. పురుషుల 56 కిలోల విభాగంలో పోటీపడిన శివ సెమీ ఫైనల్‌లో కైరత్ యెరాలియెవ్ (కజకస్థాన్)పై విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు. 2013 బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న యెరాలియెవ్ గట్టిపోటీనిచ్చినప్పటికీ శివ ఎదురుదాడి చేసి గెలవడం విశేషం. ఫైనల్ చేరడం ద్వారా 22 ఏళ్ల శివకు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత లభించింది. అతను ఫైనల్‌లో థాయిలాండ్‌కు చెందిన రెండో సీడ్ చచాయ్ బుదీని ఢీ కొంటాడు. కాగా, రియోలోనూ పతకాన్ని సాధిస్తుందనుకున్న మేరీ కోమ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఫలితంగా ఆమె రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది. మహిళల 51 కిలోల విభాగంలో పోటీపడిన మేరీ కోమ్‌ను సెమీ ఫైనల్‌లో చైనా బాక్సర్ రెన్ కాన్కన్ ఓడించింది.

బ్రెజిల్ క్రీడా మంత్రి హిల్టన్ రాజీనామా
రియో డి జెనీరో, మార్చి 31: బ్రెజిల్ క్రీడా శాఖ మంత్రి గార్జి హిల్టన్ రాజీనామా చేశాడు. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న సమయంలో అతను ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఒలింపిక్స్ నిర్వాహణకు జరుగుతున్న ఏర్పాట్లపై చాలకాలంగా బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రూసెఫ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. సకాలంలో పనులను పూర్తి చేయాలని కోరింది. జాప్యం జరిగితే ఉద్వాసన తప్పదని ఆమె పరోక్షంగా హెచ్చరించింది. ఈ కారణంగా హిల్టన్ రాజీనామా చేసినట్టు సమాచారం. అతను మాత్రం వ్యక్తిగత కారణాలను ఉటంకించాడు.

మియామీ టెన్నిస్
టైటిల్ దిశగా అజరెన్కా
మియామీ, మార్చి 31: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో 13వ సీడ్ విక్టోరియా అజరెన్కా సెమీ ఫైనల్ చేరింది. మొదటి క్వార్టర్ ఫైనల్‌లో ఆమె బ్రిటన్ క్రీడాకారిణి జొహన్నా కొన్టాను 6-4, 6-2 తేడాతో ఓడించి, ఫైనల్‌లో స్థానం కోసం రెండో ర్యాంకర్ ఏంజెలిక్ కెర్బర్‌తో మ్యాచ్‌ని ఖాయం చేసుకుంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో కెర్బర్ 6-3, 6-2 స్కోరుతో మాడిసన్ కీస్‌పై విజయం సాధించింది. కాగా, రెండో సెమీ ఫైనల్ 15వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా, 19వ సిడ్ తిమియా బాక్సిన్‌స్కీ మధ్య జరుగుతుంది. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఎకతరీన మకరోవాను కుజ్నెత్సొవా, సిమోనా హెలెప్‌ను బాక్సిన్‌స్కీ ఓడించి సెమీస్ చేరిన విషయం తెలిసిందే.
సెమీస్‌లో జొకొవిచ్
ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్ చేరాడు. అతను క్వార్టర్ ఫైనల్‌లో థామస్ బెర్డిచ్‌ను 6-3, 6-3 తేడాతో చిత్తుచేశాడు. మరో మ్యాచ్‌లో డేవిడ్ గోఫిన్ 3-6, 6-2, 6-1 ఆధిక్యంతో గిలెస్ సైమన్‌పై గెలుపొందాడు.