క్రీడాభూమి

జియో టీవీలో ప్రసారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్‌లో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న వింటర్ ఒలింపిక్ గేమ్స్ ప్రసార హక్కులను జియో టీవీ దక్కించుకుంది. ఇప్పటికే జనాదరణ పొందిన టీవీ యాప్ జియో టీవీ మన దేశంలో ప్రసార హక్కులను సంపాదించింది. గేమ్స్‌ను ప్రసారం చేసేందుకు జియో టీవీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మిలియన్ల మంది తమ మొబైళ్లలో గేమ్స్‌లను తిలకించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో జియో టీవీ కలసి పనిచేయడం ద్వారా ప్రసారాలను అందజేయనుంది. వింటర్ ఒలింపిక్స్ ఈనెల 9 నుండి 25 వరకు జరుగనున్నాయి. ఇందులో 15 క్రీడాంశాలతోపాటు స్కైయింగ్, స్కేటింగ్, స్కై జంపింగ్, ఐస్ హాకీ, స్నో బోర్డింగ్ వంటి 102 క్రీడా విభాగాలు ఉంటాయి. ప్రపంచంలోని 90 పైగా దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు.