క్రీడాభూమి

చలికి గజగజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: గతంలో ఎన్నడూ అథ్లెట్లు ఎదుర్కోనంత చలిలో పయాంగ్‌చాంగ్ వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం నుంచి మొదలుపెడితే, వివిధ పోటీలు, ఆతర్వాత ముగింపు ఉత్సవం వరకూ ప్రతి అంశానికీ అడుగడుగునా చలి తీవ్రత సమస్యలను సృష్టించడం ఖాయం. అక్కడ నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ప్రస్తుతం -25 డిగ్రీల సెల్సియస్. ఇది మరింత పెరిగి, -35 వరకూ చేరే అవకాశం లేకపోలేదు. మధ్యాహ్నం సమయాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని వింటర్ ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఓసీ) అధికారులు అంటున్నారు. అయితే, ఏ రకంగా చూసినా, అతి తక్కువ ఉష్ణోగ్రతల విషయంలో పయాంగ్‌చాంగ్ ముందు ఉంటుంది. నార్వేలోని లిలెహామర్‌లో జరిగిన 1994 వింటర్ ఒలింపిక్స్ సమయంలో -10 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. ఇప్పటి వరకూ ఈ పోటీల్లో అదే అత్యల్పం. కానీ, పయాంగ్‌చాంగ్ ఆ రికార్డును అధిగమించనుంది. సముద్ర మట్టానికి 2,460 అడుగుల ఎత్తులో ఉండే పయాంగ్‌చాంగ్ నగరం దక్షిణ కొరియాలోనే అతి చల్లని ప్రాంతం. చలితోపాటు చలిగాలులు కూడా వీస్తుంటాయి. ఈ కారణంగానే మధ్యాహ్నం వరకూ ఎవరూ బయట తిరిగే పరిస్థితి ఉండదు. వింటర్ ఒలింపిక్స్‌కు వివిధ దేశాల నుంచి వచ్చే అథ్లెట్లు, అధికారులు, అభిమానులను పయాంగ్‌చాంగ్ వాతావరణం భయపెడుతుందనేడంలో అనుమానం లేదు.