క్రీడాభూమి

పట్టువీడిన ఉత్తర కొరియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 8: దక్షిణ కొరియాతో తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ, వింటర్ ఒలింపిక్స్ కోసం ఉత్తర కొరియా పట్టువీడింది. అథ్లెట్లు మాత్రమేగాక, ఛీర్ లీడర్లను, కళాకారులను కూడా పయాంగ్‌చాంగ్‌కు పంపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మొండి పట్టుకు, వివాదాస్పద ఏకపక్ష నిర్ణయాలకు పెట్టింది పేరు. అలాంటి నియంత శత్రు దేశమైన దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకోవడం వెనుక చాలానే కసరత్తు జరిగింది. పరీక్షలు పరీక్షలు, క్షిపణులు ప్రయోగాలతో ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న ఉత్తర కొరియాలో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పర్యటించాడు. రాజకీయాలతో క్రీడలకు సంబంధం లేదని, కాబట్టి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని కిమ్‌ను కోరాడు. ప్రపంచ శాంతి నినాదంతో ఈ పోటీలను నిర్వహిస్తున్న విషయాన్ని కూడా అతను కిమ్‌కు వివరించాడు. నిజానికి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చిరకాల శత్రువులైన ఈ రెండు దేశాలు ఒకే వేదికను పంచుకోవడం చాలా అరుదు. అయితే, రాకీయాలతో క్రీడలకు సంబంధం లేదని ఇటీవల తరచు వినిపిస్తున్న వాదన. ఆ కోణంలో ఆలోచించినందువల్లే, ఉత్తర కొరియా అథ్లెట్లను దక్షిణ కొరియా సాదరంగా ఆహ్వానించింది. ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఉత్తర కొరియాను బాచ్ ఒప్పించగలిగాడు. దాని ఫలితమే ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.