క్రీడాభూమి

రీ ఎంట్రీ తొలి మ్యాచ్‌లో సెరెనా ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆష్వెల్లే (అమెరికా), ఫిబ్రవరి 12: ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ రీ ఎంట్రీ తొలి మ్యాచ్‌లోనే ఓడింది. అయితే, ఆమె సోదరి వీనస్ విలియమ్స్ తన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో గెలిచి, నెదర్లాండ్స్‌పై అమెరికాకు 3-1 తేడాతో విజయాన్ని సాధించిపెట్టింది. ఫెడ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో అరంటా రస్‌ను వీనస్, మిచెల్ హోజెన్‌క్యాంప్‌ను కొకొ వాండెవాగ్ ఓడించి, అమెరికాకు 2-0 ఆధిక్యాన్ని అందించారు. ఆదివారం వీనస్‌తో కలిసి డబుల్స్ విభాగంలో సెరెనా బరిలోకి దిగింది. ఆడ పిల్లకు గత ఏడాది సెప్టెంబర్ మాసంలో జన్మనిచ్చిన తర్వాత సెరెనా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడడం సెరెనాకు ఇదే మొదటిసారి. ఇంతకు ముందు ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడి పరాజయాన్ని చవిచూసిన సెరెనా, ఆదివారం కూడా ఓడింది. వీనస్, సెరెనా జోడీపై లెస్లే కెర్ఖావ్, డెమి షర్స్ జోడీ 6-2, 6-3 తేడాతో విజయం సాధించింది. సెరెనాతో కలిసి డబుల్స్‌లో ఓడినప్పటికీ, సింగిల్స్‌లో వీనస్ అద్భుత ప్రతిభ కనబరచింది. మిచెల్ హోజెన్‌క్యాంప్‌పై 7-5, 6-1 తేడాతో విజయభేరి మోగించింది. ఆమె విజయం అమెరికాను సెమీస్ చేర్చింది.

చిత్రం..సెరెనా విలియమ్స్