క్రీడాభూమి

టీమిండియా కోచ్‌గా రవిశాస్ర్తీ ఎంపిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్ర్తీ కాంట్రాక్టు ముగిసిందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ప్రకటించాడు. అయితే అతని కాంట్రాక్టును పొడిగించాలా? లేదా? అనే విషయంపై ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్, హైదరాబాద్ స్టైలిస్ట్ బ్యాట్స్‌మన్ వివిఎస్.లక్ష్మణ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీలతో కూడిన ఉన్నత స్థాయి క్రికెట్ సలహా కమిటీ (సిఎసి)యే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ ముగిసే వరకూ రవిశాస్ర్తీని టీమిండియా డైరెక్టర్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ గతంలో అతనితో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ కప్ టి-20 టోర్నీలో భారత జట్టు గురువారం సెమీఫైనల్‌లోనే నిష్క్రమించడంతో రవిశాస్ర్తీ కాంట్రాక్టు ముగిసినట్లయింది. అయితే రవిశాస్ర్తీ కాంట్రాక్టును పొడిగించేటట్లయితే ఈసారి అతడిని డైరెక్టర్‌గా కాకుండా భారత జట్టుకు పూర్తిస్థాయి కోచ్‌గా నియమించే అవకాశం కనిపిస్తోంది. ‘టీమిండియాకు ఇకమీదట డైరెక్టర్ ఉండడు. పూర్తిస్థాయి కోచ్‌ను మాత్రమే ఉంటాడు. దీనిపై సిఎసి దృష్టి సారిస్తుంది. డైరెక్టర్‌గా రవిశాస్ర్తీ కాంట్రాక్టు ముగిసినందున ఆయన కాంట్రాక్టును పొడిగించాలా? లేదా? అనే విషయం పరిశీలనకు వచ్చినప్పుడు కోచ్ నియామకంపై సిఎసి నిర్ణయం తీసుకుంటుంది’ అని అనురాగ్ ఠాకూర్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పడం పై విషయాన్ని స్పష్టం చేస్తోంది.