క్రీడాభూమి

కలిసొచ్చిన షార్ట్ బౌలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్సస్‌బర్గ్, ఫిబ్రవరి 19: దక్షిణాఫ్రికా గడ్డపై ఆడుతున్న వివిధ సిరీస్‌లలో తమ జట్టు బౌలర్లకు అపార అవకాశాలు దక్కుతున్నాయని పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఆదివారం జరిగిన టీ-20 తొలి మ్యాచ్‌లో భువీ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థిని తన పేస్ బౌలింగ్‌తో గడగడలాడించి కేవలం 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. భారత్ జట్టు విదేశీ గడ్డపై ఎప్పుడు ఆడినా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు ఉపయోగించిన షార్ట్ బౌలింగ్ అనుకున్నంతగా ఫలితం ఇవ్వని విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. అయితే, ఇపుడు అలాంటి పరిస్థితి తమకు ఎదురుకావడం లేదని, అదే షార్ట్ బౌలింగ్ దక్షిణాఫ్రికా గడ్డపై బాగా పనిచేస్తోందని, అందుకు తానే ఒక ఉదాహరణ అని ఆయన అన్నాడు. ఆదివారం జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో తమ జట్టు విజయకేతనం ఎగురవేయడానికి షార్ట్ బౌలింగ్ బాగా పనికొచ్చిందని అంటూ గత కొనే్నళ్లుగా ఆడుతున్న దానికి భిన్నంగా ఇపుడు మంచి ఫలితాలు రావడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ టూర్‌లోని తదుపరి మ్యాచ్‌లలో సైతం ఈ షార్ట్ బౌలింగ్ విధానాన్ని కొనసాగించే అవకాశం లేకపోలేదని ఆయన పేర్కొన్నాడు. పేస్ బౌలింగ్‌లో ఉన్న తన ఆటతీరును షార్ట్ బౌలింగ్‌తో కొంత మార్చడంతో తమకు అనుకూల ఫలితం వచ్చిందని అన్నాడు. గడిచిన మ్యాచ్‌లో తాము ఎన్నో బంతులు నెమ్మదిగా వేశామని, ఇది తమ ప్రణాళికలో ఒక భాగమని, దీనివల్ల బ్యాట్స్‌మన్ ఎక్కువగా పరుగులు చేసే అవకాశం ఉండదని ఆయన వ్యాఖ్యానించాడు.

చిత్రం..భారత్ పేసర్ భువనేశ్వర్ కుమార్