క్రీడాభూమి

చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ మాంచెస్టర్ యునైటెడ్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, డిసెంబర్ 9: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ నిష్క్రమించింది. ఊల్ఫ్స్‌బెర్గ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ని 3-2 తేడాతో చేజార్చుకొని, ప్రీ క్వార్టర్స్‌లో స్థానం దక్కించుకోలేకపోయింది. నాల్డో రెండు గోల్స్ చేసి ఊల్ఫ్స్‌బెర్గ్ ప్రీ క్వార్టర్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ 10వ నిమిషంలోనే మాంచెస్టర్ యునైటెడ్‌కు మార్షల్ ద్వారా తొలి గోల్ లభించింది. అయితే, మరో మూడు నిమిషాల్లోనే ఊల్ఫ్స్‌బెర్గ్‌కు నాల్డో ఈక్వెలైజర్‌ను అందించాడు. వియరిన్హా 29వ నిమిషంలో సాధించిన గోల్‌తో ఈ జట్టు 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆతర్వాత ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. ఫలితంగా ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో చాలాసేపు ఇరు జట్ల మధ్య సంకుల సమరం జరిగింది. 82వ నిమిషంలో గలవొగీ చక్కటి గోల్ చేయడంతో ఈక్వెలైజర్‌ను అందుకున్న మాంచెస్టర్ యునైటెడ్ ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆ జట్టు ఆనందానికి కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే నాల్డో తెరదించాడు. 84వ నిమిషంలో అతను చేసిన గోల్ ఉల్ఫ్స్‌బెర్గ్‌ను ప్రీ క్వార్టర్స్ చేర్చగా, మాంచెస్టర్ యునైటెడ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
బాధ్యత నాదే: వాన్ గాల్
చాంపియన్స్ లీగ్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ నిష్క్రమించడానికి కారణాలను వెతకదలచుకోలేదని, బాధ్యతను పూర్తిగా తానే స్వీకరిస్తానని ఆ జట్టు కోచ్ లూయిస్ వాన్ గాల్ అన్నాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోవడంతో తమ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని వాపోయాడు. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్తున్నానని అన్నాడు.

రోహిత్ ‘రెజ్లింగ్’!

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఇప్పుడు రెజ్లింగ్‌పై దృష్టి పెట్టాడు. గురువారం నుంచి మొదలయ్యే ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్)లో యుపి వారియర్స్ జట్టుకు అతను సహ భాగస్వామి అయ్యాడు. బాలీవుడ్ ధర్మేంద్ర వంటి హేమాహేమీలు ప్రో రెజ్లింగ్‌లో భాగస్వాములుకాగా, ఆ జాబితాలో రోహిత్ కూడా చేరాడు. యుపి వారియర్స్ ఫ్రాంచైజీలో భాగస్వామినైనందుకు ఎంతో సంతోషిస్తున్నానని రోహిత్ అన్నాడు. తమ జట్టులో సుశీల్ కుమార్ వంటి ఎంతో మంది పేరుమోసిన రెజ్లర్లు ఉన్నారని చెప్పాడు. రెజ్లింగ్‌కు భారత్‌కు చారిత్రక నేపథ్యం ఉందని చెప్పాడు. యుపి వారియర్స్ జట్టుకు కొనుగోలు చేసిన ప్రోసోర్టిఫై డైరెక్టర్ విశాల్ గుర్నాని మాట్లాడుతూ రోహిత్ వంటి పేరొందిన క్రికెటర్ రెజ్లింగ్‌పై దృష్టి సారించడం సంతోషించాల్సిన విషయమని అన్నాడు. ఈ టోర్నీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.