క్రీడాభూమి

సచిన్ శ్రమ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: భారత మేటి బాక్సర్ సచిన్ సివాచ్ అద్భుతంగా రాణించిన్నప్పటికి రష్యాలోని ఖాజాన్ (కతార్)లో జరుగుతున్న వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 1-4 తేడాతో రష్యా చేతిలో ఓటమి పాలైంది. ఇక్కడ ప్రారంభమైన ద్వితీయ వరల్డ్ సిరీస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వరల్డ్ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్ 49 కేజీల విభాగం లైట్ ఫ్లైట్ వెయిట్ విభాగంలో జరిగిన పోటీలో రష్యాకు చెందిన డోర్జోపై 2-1 తేడతో విజయం సాధించాడు. ఇద్దరి మధ్య అత్యంత అసక్తి కరంగా సాగిన మ్యాచ్‌లో పోటీ సరవత్తరంగా సాగింది. సచిన్ మొదటి రెండు రౌండ్‌లో రష్యా బాక్సర్ చేతిలో ఓడిపోయాడు. అనంతరం అత్మసె్తైయిర్యం నింపుకున్న సచిన్ తనైన శైలీలో అవుట్ పంచ్‌లతో ప్రత్యర్థిపై దాడికి దిగి చివరి మూడు రౌండ్‌లలో ఆధీక్యాన్ని కనపరిచి 2-1 పాయింట్ల తేడాతో విజయం సాదించాడు. శుక్రవారం రాత్రి జరిగిన అసక్తికరమైన మరో మ్యాచ్ భారత్‌కు చెందిన ఆర్మీ బాక్సర్ సంజీత్ 91 కేజీల విభాగంలో 0-3 తేడాతో రష్యాకు చెందిన ఆన్‌టోన్ జైత్సేవ్ చేతిలో ఓడిపోయాడు. 21 ఏళ్ల ఆర్మీ బాక్సర్ సంజీత్ జనవరిలో జరిగిన ఇండియాన్ ఓపెన్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. స్వర్ణ పతకం గెలుచుకున్న తరువాత తాను ఆడిన మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదె ప్రథమం. కామనె్వల్త్ క్రీడల్లో రజతం సాధించిన మన్‌దీప్ జంగ్రా(75 కేజీలు), కింగ్స్ కప్ కాంస్య పతక విజేత రోహిత్ తోకాస్ (64 కేజీలు), మాజీ జాతీయ చాంపియన్ మధన్‌లాల్ (52 కేజీలు) ఇక్కడ జరిగిన బౌట్స్‌లో ఓటమి పాలయ్యారు. భారత జట్టు తిరిగి ఈనెల 24వ తేదీన ఆస్టానా ఆర్లాన్స్‌తో తలపడనుంది.