క్రీడాభూమి

మోయిన్ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మార్చి 3: ఆల్‌రౌండర్ మోయిన్ అలీ బౌలింగ్‌లో రాణించి, మూడు వికెట్లు పడగొట్టడమేగాక, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో శనివారం ఇక్కడ జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్‌ను ఇంగ్లాండ్ నాలుగు పరుగుల తేడాతో గెల్చుకుంది. చివరి క్షణం వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు స్పిన్నర్లు అండగా నిలవడం విశేషం. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచినప్పటికీ, కివీస్ పరాజయాన్ని అడ్డుకోలేకపోవడం దురదృష్టకరం. 235 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి విశ్వప్రయత్నం చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించగలిగింది. కేవలం నాలుగు పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌పై 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది.
టాస్ గెలిన కివీస్
న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి, లక్ష్యాన్ని నిర్దేశించడం కంటే ఛేదించడమే సులభమన్న అభిప్రాయంతో ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ సరిగ్గా 50 ఓవర్లు ఆడి, 234 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దాడి కేసులో విచారణను ఎదుర్కొంటూ కొన్ని సిరీస్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 39 పరుగులు చేవాడు. నాటౌట్‌గా నిలిచిన టామ్ కూరన్ (2), చివరిలో రనౌటైన మార్క్ ఉడ్ (1) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ అంతా రెండంకెల స్కోర్లు చేయగలగడంతో, ఇంగ్లాండ్ 234 పరుగులు సాధించగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్ కొలిన్ మున్రో (49), కేన్ విలియమ్‌సన్ (112 నాటౌట్), చివరిలో మిచెల్ సాంట్నర్ (41) అండగా నిలిచాడు. అయితే, మరో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌తోపాటు మిడిల్ ఆర్డర్‌లో ఎవరూ డబుల్ డిజిట్స్‌ను కూడా అందుకోలేకపోవడంతో కివీస్‌కు పరాజయం తప్పలేదు. విలియమ్‌సన్ కడ వరకూ పోరాడినప్పటికీ విజయానికి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయింది. స్పిన్నర్లు మోయిన్ అలీ మూడు, అదిల్ రషీద్ రెండు చొప్పున వికెట్లు సాధించారు. పేసర్ క్రిస్ వోక్స్‌కు రెండు వికెట్లు లభించాయి. 23 పరుగులు చేయడమేగాక, బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు పడగొట్టిన మోయిన్ అలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ సిరీస్‌లో నాలుగో వనే్డ బుధవారం డ్యునెడిన్‌లో జరుగుతుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 234 ఆలౌట్ (ఇయాన్ మోర్గాన్ 48, బెన్ స్టోక్స్ 39, జొస్ బట్లర్ 29, మోయిన్ అలీ 23, ఇష్ సోధీ 3/53, ట్రెంట్ బౌల్ట్ 2/47).
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 (కొలిన్ మున్రో 49, కేన్ విలియమ్‌సన్ 112 నాటౌట్, మిచెల్ సాంట్నర్ 41, మోయిన్ అలీ 3/36, అదిల్ రషీద్ 2/34, క్రిస్ వోక్స్ 2/40).
ఆల్‌రౌండ్ ప్రతిభతో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన మోయన్ అలీ