క్రీడాభూమి

రిజ్వీకి ‘రికార్డు’ స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత ఏస్ షూటర్ షాజర్ రిజ్వీ కొత్త రికార్డు నెలకొల్పాడు. మొత్తం 242.3 పాయింట్లను సంపాదించిన అతను రికార్డుతోపాటు స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్ క్రిస్టియన్ రీజ్ (జర్మనీ)ని అతను రెండో స్థానానికి నెట్టేయడం విశేషం. రీజ్ 239.7 పాయింట్లతో రజత పతకాన్ని సంపాదించాడు. కాగా, ఈ ఈవెంట్‌లో కాంస్యం కూడా భారత్‌కు లభించింది. జీతూ రాయ్ 219 పాయింట్లు సాధించి, కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. భారత్‌కే చెందిన ఓం ప్రకాశ్ మిథార్వాల్ 198.4 పాయింట్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించడం గమనార్హం.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ ముగ్గురు భారతీయులకు ఫైనల్ రౌండ్‌లో చోటు లభించింది. అయితే, వారిలో మెహూలీ ఘోష్ (228.4 పాయింట్లు) మాత్రమే పతకాన్ని గెల్చుకోగలిగింది. ఆమె కాంస్య పతకాన్ని దక్కించుకుంది. అంజుమ్ వౌద్గిల్ 208.6 పాయింట్లతో నాలుగు, అపూర్వీ చండీలా 144.1 పాయింట్లతో ఏడు స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో, గత ఏడాది వరల్డ్ కప్ ఫైనల్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న రుమేనియా షూటర్ లారా జార్గెటా కోమన్ స్వర్ణాన్ని అందుకుంది.