క్రీడాభూమి

కీలక పోరు నేడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపో (మలేషియా), మార్చి 5: మలేషియాలో జరుగుతున్న అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ ఢీకొంటుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లో ఒక పరాజయాన్ని చవిచూసిన సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీనితో మంగళవారం నాటి మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ఓటమి పాలు కాగా, మరొకటి డ్రాగా ముగియడంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సీనియర్లు లేకపోవడం, అంతగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్ జట్టు మూడో మ్యాచ్‌లో రాణిస్తుందా? అని విశే్లషకులు భావిస్తున్నారు. భారత్ అర్జెంటీనాతో తలపడిన మొదటి మ్యాచ్ 1-1 గోల్స్ తేడాతో డ్రాగా ముగిసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా జట్టు 4-1తో ఇంగ్లాండ్‌పై, మరో మ్యాచ్‌లో 3-1తో పోటీలకు అతిథ్యమిస్తున్న మలేషియాపై విజయం సాధించి పూర్తి విశ్వాసంతో ఉన్న ఆస్ట్రేలియా మూడో మ్యాచ్‌లో కూడా గెలవాలన్న ధీమాతో బరిలోకి దిగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాపై చక్కటి పోరాటాన్ని కనబరిచిన భారత్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో గోల్స్ చేసేందుకు వచ్చిన పలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో పూర్తిగా విఫలమైంది. గత సంవత్సరం కాంస్యం సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి నాలుగో స్థానంలో నిలిచింది. మంగళవారం భారత్ ప్రపంచ నెంబర్ వన్ ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఏకంగా తొమ్మిది పెనాల్టీ కార్నర్ (పీసీ) పాయింట్లు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇందులో ఎనిమిది పాయింట్లు రెండో క్వార్టర్‌లోనే లభించాయి. పటిష్ట ఇంగ్లాండ డిఫెన్స్‌ను ఏమార్చడంలో డ్రాగ్‌ప్లికర్స్ వరుణ్ కుమార్, రోహిదాస్ విఫలమయ్యారు. అలాగే కొన్ని ఫీల్డ్ గోల్స్‌లను కూడా భారత ఆటగాళ్లు నెట్‌లోకి పంపలేకపోయారు. దీంతో ఆట 1-1తో డ్రాగా ముగిసింది. టోర్నమెంట్‌లో ఆతిథ్య మలేషియా జట్టుతోపాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, ఐర్లాండ్ జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో ఒక్కోసారి తలపడి ఆగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌గా టైటిల్ పోరులో తలపడతాయి. ఈనెల 6న ఆస్ట్రేలియా, 7న మలేషియా, 9న ఐర్లాండ్‌తో తలపడుతుంది.