క్రీడాభూమి

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా గంభీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ సీజన్‌కు సంబంధించి ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ నియమితుడయ్యాడు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ గంభీర్‌కు ఇదే జట్టు కెప్టెన్‌గా అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేనెలలో జరుగనున్న ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా చాన్స్ రావడం చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. కెప్టెన్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జట్టులోని సహచర సభ్యులతో కలసి సమష్టిగా ఆడడం ద్వారా మంచి ఫలితాలు తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు జట్టును విజయపథంలోకి తీసుకెళ్లడంలో తగిన పాత్ర పోషించాడు ఈ 36 ఏళ్ల ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్. అంతేకాకుండా భారత్ రెండుసార్లు ప్రపంచ కప్ సాధించడంలో సైతం గంభీర్ పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్ రికీ పాంటింగ్ తమ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్న నేపథ్యంలో అలాంటి సీనియర్ క్రికెటర్ తో కలసి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మళ్లీ ఆడేందుకు అవకాశం రావడం గొప్ప విషయంగా ఆయన అభివర్ణించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీ 2.8 కోట్ల రూపాయలు వెచ్చించి జట్టులోకి తీసుకున్న గంభీర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 148 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4,132 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా తనదైన ముద్రతో దూసుకుపోగల సామర్థ్యం ఉన్న అగ్రశ్రేణి క్రికెటర్లలో ఒకడిగా గంభీర్ ఆటతీరు ఉంటుందని ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. గంభీర్‌కు మళ్లీ గొప్ప అవకాశం రావడంతో జట్టును సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లగలడనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా సహచర సభ్యులతో కలిసి మెలిసి వ్యవహరించడంతోపాటు జట్టు ఫ్రాంచైజీ గర్వించేలా వ్యవహరిస్తాడని ఆయన పేర్కొన్నాడు.
ఇదిలావుండగా, గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా కొన్ని పరుగులు చేసిన గౌతం గంభీర్, ఇపుడు ఇదే జట్టుకు కెప్టెన్సీ వహించనుండడంతో ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుందని, ఇదే తనకు బాగా రాణించేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నాడు. అయితే, ఇలాంటి ప్రశాంత వాతావరణం ఉన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో గతంలో ఆడిన సమయంలో అనుకున్న రీతిలో ప్రదర్శన చూపలేకపోయానని గంభీర్ అంగీకరిస్తూ జట్టుకు కెప్టెన్‌గా నియమించేందుకు సహకరించిన ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, జట్టు ఫ్రాంచైజీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. కెప్టెన్‌గా సారధ్యం వహిస్తూ ఉత్తమ, సంతోషం, ప్రశాంత వాతావరణం కలిగిన జట్టును ప్రగతిపథంలో పయనింపజేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. వచ్చేనెలలో జరుగనున్న పదకొండో సీజన్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను గెలిపించే బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకుంటానని, ఇందుకు జట్టులోని అందరి సహకారం తనకు అందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు.