క్రీడాభూమి

ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డునేడిన్, మార్చి 7: ఇక్కడి యూనివర్సిటీ ఓవల్ స్టేడియంలో జరిగిన నాలుగో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుని, ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 50 ఓవర్లకు ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 335 పరుగులు చేయగా, అందుకు ప్రతిగా న్యూజిలాండ్ 49.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు నమోదు చేసినా ఆ జట్టును విజయం వరించలేదు. జానీ బెయిర్‌స్టో 106 బంతులు ఎదుర్కొని ఏడు సిక్సర్లు, 14 బౌండరీల సహాయంతో 138 పరుగులు చేయగా, జో రూట్ 101 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఆరు బౌండరీల సహాయంతో 102 పరుగులు చేశాడు. జాసన్ రోయ్ 41 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఐదు బౌండరీలతో 42 పరుగులు చేయగా, టామ్ కురన్ 10 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ జట్టులో మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరు చేయలేకపోయారు. ఇక బౌలింగ్‌లో ఇష్ సోధి అత్యధికంగా నాలుగు వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఇతను 10 ఓవర్లలో 58 పరుగులిచ్చాడు. ట్రెంట్ బౌల్ట్, కొలిన్ మన్రో చెరో రెండు వికెట్లు సాధించగా, టిమ్ సౌథీ ఒక వికెట్ తీసుకున్నాడు.
ఇక న్యూజిలాండ్ జట్టులో రాస్ టేలర్ 147 బంతులు ఎదుర్కొని ఆరు సిక్సర్లు, 17 బౌండరీల సహాయంతో 181 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ టామ్ లథన్ 67 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, రెండు బౌండరీలతో 71 పరుగులు చేశాడు. కెప్టెన్ విలియమ్సన్ 48 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీల సహాయంతో 45 పరుగులు చేశాడు. కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ 12 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, రెండు బౌండరీలతో 23 పరుగులు చేయగా, హెన్రీ నికొలస్ 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 13 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ కరన్ 8.3 ఓవర్లలో 57 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. క్రిస్ వోక్స్ ఎనిమిది ఓవర్లలో 42 పరుగులిచ్చి ఒక వికెట్, మార్క్ ఉడ్ ఎనిమిది ఓవర్లలో 65 పరుగులిచ్చి ఒక వికెట్, బెన్ స్టోక్స్ ఏడు ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.

నాలుగో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్

రెండో వనే్డపై ఆస్ట్రేలియా కన్ను

ముంబయి, మార్చి 7: ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వనే్డ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టును 321 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా మహిళా జట్టు గురువారం జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌పై దృష్టి సారించింది. ఈనెల 12నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య టీ-20 ముక్కోణపు టోర్నీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్‌తో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో మంచి పరిణితి కనబరచిన ఆసిస్ సేన ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా పేలవమైన ఆటతీరుతో భారత్ సేన నిరాశకు గురిచేసింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ మెక్ లానింగ్ నాయకత్వంలోని ఆసిస్ 413/8తో ఘనవిజయం సాధించిన ఉత్సాహంతో రెండో మ్యాచ్‌పై కూడా పట్టు సాధించేందుకు తహతహలాడుతోంది. అయితే, తొలి మ్యాచ్‌లో పరువుపోయినా రెండోదాన్లో ప్రత్యర్థికి ధీటైన సమాధానం చెప్పాలని భారత్ కెప్టెన్ అనుజా పాటిల్ నాయకత్వం యోచిస్తోంది.

క్రికెట్‌కు ఆస్ట్రేలియా
మాజీ ఓపెనర్ ఎడ్ కొవాన్ గుడ్‌బై

సిడ్నీ, మార్చి 7: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ ఎడ్ కొవాన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 35 ఏళ్ల కొవాన్ 2013 నుంచి ఇప్పటివరకు పదివేల పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి. 2017-18 సీజన్‌లో న్యూ సౌత్ వేల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఎంతో మక్కువ చూపేవాడినని, ఇప్పటికీ అదే ఆసక్తి ఉందని అన్నాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సీజన్‌లో సిడ్నీ యూనివర్సిటీలో జరిగే ప్రీమియర్ క్రికెట్‌లో ఆడి టైటిల్ సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నాడు.