క్రీడాభూమి

400 మీటర్ల పరుగు పందెంలో యువ ధరుణ్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటియాల, మార్చి 8: తమిళనాడుకు చెందిన అథ్లెట్ అయ్యసామి ధరుణ్ 400 మీటర్ల పరుగు పందెంలో రికార్డు సృష్టించాడు. ఇక్కడ జరుగుతున్న 22వ ఫెడరేషన్ కప్ నేషనల్ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ధరుణ్ రికార్డును తిరగరాసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఈ ఘన విజయం ద్వారా త్వరలో జరిగే కామనె్వల్త్ గేమ్స్‌లో చోటు దక్కే అదృష్టానికి చేరువయ్యాడు. 21 ఏళ్ల ధరుణ్ టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా పోరాటి కేవలం 49.45 సెకండ్లలోనే లక్ష్యాన్ని చేరుకుని గత రికార్డును సవరించాడు. గత ఆగస్టులో ఒకాసాలో జరిగిన పోటీలో పదేళ్ల క్రితం జోసెఫ్ అబ్రహాం అనే అథ్లెట్ సాధించిన రికార్డును కేవలం 49.94 సెకండ్లలో ఛేదించి అప్పట్లో జాతీయ రికార్డును నెలకొల్పాడు. ధరుణ్ బెంగళూర్‌లో 2016 జూలైలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో పతకం సాధించడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. రియో ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగుపందెంలో ఆడినా అనుకున్న రీతిలో ఫలితం రాలేదు.