క్రీడాభూమి

సౌతాఫ్రికా క్రికెట్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజెబెత్, మార్చి 10 : దక్షిణాఫ్రికా క్రికెట్‌కు సంబంధించిన ఇద్దరు సీనియర్ అధికార్లు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోనున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వీరు రగ్బీ క్రీడాకారుడైన సోనీ బిల్ విలియమ్స్ మాస్క్‌లు ధరించి ఫోటోలకు ఫోజులివ్వడమే ఇందుకు కారణం. వార్నర్ భార్య కాండిస్, రగ్బీ ఆటగాడైన విలియమ్స్ 2007కు ముందు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. తర్వాత విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత, ఆమె వార్నర్‌ను వివాహమాడారు. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వార్నర్, దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ మధ్య ఘర్షణ జరిగింది. డికాక్ తన భార్యను అవమాన పరుస్తూ మాట్లాడటమే ఇందుకు కారణమని వార్నర్ చెప్పాడు. అయితే క్రికెట్ సౌతాఫ్రికా శనివారం ఒక విడుదల చేసిన ఒక ప్రకటనలో మాస్క్‌లు ధరించిన అధికార్లపై చర్య విషయంలో దూరంగా ఉండిపోయింది. మార్కెటింగ్ మేజేజర్ క్లైవ్ ఎకస్టీన్, కమ్యూనికేషన్స్ మేనేజర్ అల్డాప్ కాజిలు కేవలం వార్నర్‌ను అవమానించడానికే విలియమ్స్ మాస్క్‌లు ధరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరిలో ఎకస్టీన్ గతంలో క్రికెట్ ఆటగాడు. వీరు ఇద్దరు ప్రేక్షకులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. సిఎస్‌ఏ దీనిపై స్పందిస్తూ ఇది సీఎసఏ అంతరంగిక విషయమైనందువల్ల, ఆంతరంగికంగా క్రమశిక్షణా చర్యలు చేపడతామని పేర్కొంది. కాగా సీఎస్‌ఏ అధ్యక్షుడు క్రిస్ నెన్జానీ, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పారు. దక్షిణాఫ్రికా మద్దతుదార్లు, నిగ్రహం పాటించాలని సీఎస్‌ఏ కోరింది. కాగా గ్రౌండ్‌లోకి మాస్క్‌లతో రావడానికి అనుమతించడం పట్ల ఆస్ట్రేలియా టీమ్ ఆగ్రహం వ్యక్త చేసిందని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది.