క్రీడాభూమి

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన క్రికెటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 10: శ్రీలంక క్రికెటర్ రమిత్ రంబుక్‌వెల్లా తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. తాగి వాహనం నడపడమే కాకుండా తమపై దాడి చేశాడన్న యూనివర్సిటీ విద్యార్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ధృవీకరించారు. ఆదివారం ఆయనను అలుత్‌కడే మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 18 నెలల కాలంలో రమిత్ అరెస్ట్ కావడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 2016లో కొలంబోలో కారు యాక్సిడెంట్ కేసులో అతడు అరెస్టయ్యాడు. అంతకుముందు 2013లో జట్టు సభ్యులతో కలిసి విండీస్ నుంచి విమానంలో వస్తుండగా ప్రమాదకరంగా ప్రవర్తించాడు. విమానం 35వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నపుడు బలవంతంగా కేబిన్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానంలో ఉన్నవారు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అండర్-19 జట్టుకు ఆడుతున్నప్పటి నుంచే రమిత్‌పై పలు ఆరోపణలున్నాయి. రమిత్ తాజా అరెస్ట్‌కు గల కారణాలను శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే అరెస్ట్ అయినట్టు మాత్రం పేర్కొన్నారు.