క్రీడాభూమి

ఐర్లాండ్‌పై భారత్ ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇఫొ(మలేసియా), మార్చి 10: ప్రతిష్టాత్మక అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. భారత్ 4-1 గోల్స్ తేడాతో ప్రత్యర్థి ఐర్లాండ్‌పై విజయం సాధించింది. భారత్ బదులు తీర్చుకుని సత్తాచాటింది. శుక్రవారం ఏ జట్టు చేతిలో ఓడిపోయి పతక ఆశలను ఆవిరి చేసుకుందో శనివారం అదే జట్టుపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం మ్యాచ్‌లో 2-3 గోల్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఈ రోజు 4-0 గోల్స్ తేడాతో విజయం సాధించి సత్తాచాటింది.
టోర్నమెంట్‌లో భాగంగా శనివారం భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య ఐదు, ఆరు స్థానాల కోసం ఓటీ నిర్వహించారు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన భారత్ ఐదో నిమిషంలోనూ తొలి గోల్ నమోదు చేసింది. ఆట ముగిసే సమయానికి భారత్ ఖాతాలో 4 గోల్స్ వచ్చి చేరాయి. దీంతో 4-1 తేడాతో విజయం సాధించిన భారత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అత్యంత అసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడి త్వరత్వరగా గోల్స్ సాధించడంలో నిమగ్నమయ్యారు. రౌండ్ రాబిన్ లీగ్‌లో చివరి మ్యాచ్ భారత్-ఐర్లాండ్‌ల మధ్య జరిగింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఐదో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఎలాగైనా ప్రతీకారం తీసుకోవాలన్న సమాలోచనలో భారత జట్టు బరిలోకి దిగింది. భారత్ జట్టులో వరుణ్‌కుమార్ 5వ, 32వ నిమిషంలో, శీలానంద్ లక్ర 28వ నిమిషంలో, గుర్జాంత్ సింగ్ 37వ నిమిషంలో గోల్స్ చేసి జట్టు విజయపథం వైపు నడిపించారు. ఐర్లాండ్ జట్టులో మాత్రం 48వ నిమిషంలో జూలిన్ డాలే ఒక గోల్ చేశాడు.
భారత్ ఆటగాళ్లు మొదటి నుంచి ప్రత్యర్థి అటగాళ్ల ఎత్తులను కట్టడి చేస్తూ ముందుకు సాగి కార్నర్స్ ఆటపై దృష్టి సారించారు. మొదటి ఐదు నిమిషాల్లో ప్రథమ పెనాల్టీ కార్నర్‌ను భారత్ నిలువరించింది. భారత్ అటాకింగ్ గేమ్‌పై దృష్టి సారించి గోల్స్ సాధించడానికి ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. రెండో క్వార్టర్ ఆట భారత్‌కు కలిసొచ్చింది. ఐర్లాండ్ ఆటగాళ్లు పెనాల్టీ కార్నర్లపై అధికంగా దృష్టి పెట్టినప్పటికీ వాటిని నిలువరించడంలో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించారు. దీంతో ఆట 32వ నిమిషం ముగిసే సమయానికి భారత్ 3-0 ఆధిక్యతను సాధించింది.
మళ్లీ 37వ నిమిషంలో భారత్‌కు మరో గోల్ వచ్చి చేరింది. దీంతో భారత్ స్కోరు నాలుగుకు చేరుకుంది. 37వ నిమిషంలో గురజంత్ సింగ్ చక్కటి గోల్ చేసి భారత్‌కు మరో పాయింటును అందించడంతో మొత్తం నాలుగు గోల్స్‌తో ఆధిక్యతను ప్రదర్శించింది. అనంతరం 48వ నిమిషంలో ఐర్లాండ్‌కు చెందిన జులియన్ దాలే గోల్ సాధించాడు. ఆట చివరి 50 నిమిషంలో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ అవకాశాన్ని చేజార్చుకోవడంతో ఆట ముగిసే సమయానికి భారత్ 4-1 తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించి అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఐదో స్థానంలో సంతృప్తి పడాల్సి వచ్చింది.