క్రీడాభూమి

ముక్కోణపు టీ-20లో భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 12: ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో నిర్వహిస్తున్న ముక్కోణపు నిదహాస్ టీ-20 ఇంటర్నేషనల్ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య జట్టుపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలిదశలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, జట్టులో మనీష్ పాండే, దినేష్ కార్తీక్ చక్కటి ఆటతీరును ప్రదర్శించి నాలుగో వికెట్ పతనం తర్వాత 68 భాగస్వామ్యాన్ని సాధించి జట్టుకు విజయాన్ని చేకూర్చారు. భారత్‌తో జరిగిన నాలుగో టీ-20 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు శ్రీలంక జట్టు 19 ఓవర్లలో (వర్షం కారణంగా ఒక ఓవర్‌ను కుదించారు) తొమ్మిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టులో దనుష్క గుణతిలక ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 17 పరుగులు చేసి ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ కుశాల్ పెరీరా నాలుగు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. ఉపుల్ తరంగ 24 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 22 పరుగులు చేసి విజయ్ శంకర్ చేతిలో బౌల్డ్ అయ్యాడు.
కెప్టెన్ తిసర పెరీరా ఆరు బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లతో 15 పరుగులు చేసి ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. జీవన్ మెండిస్ మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి వాషింగ్టన్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. అకిల ధనంజయ 11 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి ఉనద్కత్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాసున్ షనక 16 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 19 పరుగులు చేసి ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో మురళీ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దుశమంత చమీరా ఒక పరుగు మాత్రమే చేసి ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో ఉనద్కత్‌కు క్యాచ్ ఇచ్చాడు. సురంగ లక్మల్ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో, నువాన్ ప్రదీప్ పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచారు.
భారత జట్టులో శార్దూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు, జయదేవ్ ఉనద్కత్ మూడు ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్, యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒక వికెట్, విజయ్ శంకర్ మూడు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 17.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. జట్టులో ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను చేజార్చుకుంది. రోహిత్ శర్మ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 11 పరుగులు చేసి అకిల ధనంజయ బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. శిఖర్ ధావన్ 10 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో ఎనిమిది పరుగులు చేసి ధనంజయ బౌలింగ్‌లో తిసర పెరీరీకు క్యాచ్ ఇచ్చాడు. లోకేష్ రాహుల్ 17 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 18 పరుగులు చేసి మెండిస్ చేతిలో హిట్ వికెట్‌గా దొరికాడు. సురేష్ రైనా 15 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, రెండు బౌండరీలతో 27 పరుగులు చేసి ఎన్.ప్రదీప్ బౌలింగ్‌లో తిసర పెరీరాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మనీష్ పాండే 31 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీల సహాయంతో 42 పరుగులు, దినేష్ కార్తీక్ 25 బంతులు ఎదుర్కొని ఐదు బౌండరీలతో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
సంక్షిప్త స్కోరు
శ్రీలంక: (మొత్తం 19 ఓవర్లలో 152/9) ధనుష్క గుణతిలక బి ఎస్.ఎన్.్ఠకూర్ సి రైనా 17, కుశాల్ మెండిస్ సి చాహల్ బి రోహిత్ శర్మ 55, కుశాల్ పెరీరా బి వాషింగ్టన్ సుందర్ 3, ఉపుల్ తరంగ బి విజయ్‌శంకర్ 22, తిసర పెరీరా బి ఎస్.ఎన్.్ఠకూర్ సి యుజ్వేంద్ర చాహల్ 15, జీవన్ మెండిస్ బి వాషింగ్టన్ సుందర్ 1, దాసున్ షనక బి ఎస్.ఎన్.్ఠకూర్ సి మురళీ కార్తీక్ 19, అకిల ధనంజయ బి ఉనద్కత్ సి రాహుల్ 5, దశమంత చమీరా బి ఎస్.ఎన్.్ఠకూర్ సి ఉనద్కత్ 0.
భారత్: (17.3 ఓవర్లలో 153/4).రోహిత్ శర్మ సి కుశాల్ మెండిస్ బి ధనంజయ 11, శిఖర్ ధావన్ సి తిసర పెరీరా బి ధనంజయ 8, లోకేష్ రాహుల్ హిట్ వికెట్ బి జె.మెండిస్ 18, సురేష్ రైనా సి పెరీరా బి ఎన్.ప్రదీప్ 27, మనీష్ పాండే నాటౌట్ 42, దినేష్ కార్తీక్ 39.

చిత్రం..బ్యాటింగ్‌లో రాణించి భారత్‌ను విజయపథంలో నడిపించిన మనీష్ పాండే