క్రీడాభూమి

విరాట్‌కు ఇక తిరుగులేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నదేన ముద్ర వేసుకున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో, అద్భుతమైన కెప్టెన్సీతో ఈ పరుగుల వీరుడు ఇప్పటికే ఎన్నో చరిత్రాత్మక రికార్డులు బద్దలుకొట్టాడు. అయితే త్వరలోనే విరాట్ కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం. సచిన్ తెండూల్కర్ రికార్డులు తిరగరాస్తాడని నాగ్‌పూర్‌కు చెందిన క్రికెట్ జోతిష్కుడు నరేంద్ర బుందే పేర్కొన్నాడు. గతంలో నరేంద్ర బుందే టీం ఇండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి జట్టులో స్థానం కల్పించడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో అతను 2019 ప్రపంచకప్ వరకూ జట్టులో కొనసాగుతాడని జోస్యం చెప్పాడు.
తాజాగా విరాట్ కోహ్లీ 2025కల్లా టీ-20, వనే్డ ప్రపంచకప్‌లు గెలుస్తాడని పేర్కొన్నాడు. ‘నేను గతంలో చెప్పిన జాతకాలన్నీ నిజమయ్యాయి. ఇపుడు చెప్పినవి కూడా అక్షర సత్యాలు. త్వరలో విరాట్, క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్ రికార్డులతో పాటు అతను మార్క్ మాస్కరెనాస్‌తో కుదుర్చుకున్న భారీ వ్యాపార ఒప్పందం లాంటి ఒప్పందం అవుతుంది’ అని నరేంద్ర తెలిపాడు. కోహ్లీకి శుక్రుడు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అందుకే అతను వదేశాల్లోనూ రాణిస్తున్నాడు. రానున్న ఆస్ట్రేలియా సిరీస్ కూడా టీం ఇండియాకు బాగా కలసివస్తోందిన బుందే తెలిపాడు.
గతంలో నగల దుకాణానికి యజమాని అయిన బుందే 2006 నుంచి క్రికెటర్ల జాతకాలు చెప్పడం ప్రారంభించాడు. అతిన వద్ద గంగూలీ, మురళీ కార్తీక్, కృష్ణమాచారి శ్రీకాంత్, జహీర్‌ఖాన్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా తదితరులు జాతకం చెప్పించుకున్నారు. అంతేకాక, ఐపీఎల్‌లో ప్రీతి జింటా ఫ్రాంచైజీ గడ్డుకాలాన్ని ఎదురుకుంటున్న సమయంలోనూ బుందే వద్ద ప్రీతి సలహా తీసుకుంది.