క్రీడాభూమి

ఇక అన్ని అకాడమీలూ ఒకే నిబంధనల ఛత్రం కిందికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: అఖిల భారత టెన్నిస్ అసోసియేన్ (ఎఐటిఏ), సంస్థాపరంగా నెలకొన్న ఉదాసీనతకు చరమగీతం పాడాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని ప్రైవేటు అకాడమీలను ఏకీకృత నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. వీటివల్ల, పెడరేషన్ వద్ద రిజిస్టర్ చేసుకున్న కేంద్రాలు మాత్రమే, వివిధ వయోగ్రూపులకు సంబంధించిన క్రీడలను నిర్వహించే అవకాశం ఉంటుంది. దీన్ని ఎఐటిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించడంతో, దేశవ్యాప్తంగా ఉన్న అకాడమీలు తక్షణమే రిజిస్ట్రేషన్‌కోసం తమ రాష్టస్థ్రాయి అసోసియేషన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2018, జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోని సంస్థలు క్రీడా పోటీలను నిర్వహించడానికి వీలుండదు. దేశ వ్యాప్తంగా వివిధ అకాడమీలు, ఏఐటిఏ టాలంట్ సిరీస్, ఛాంపియన్‌షిప్ సిరీస్, సూపర్ సిరీస్, నేషనల్ సిరీస్, నేషనల్స్ పేరుతో క్రీడాపోటీలను నిర్వహిస్తున్నాయి. అయితే వీటిల్లో చాలా పోటీలు వృత్తి విరుద్ధమైన రీతిలో ఉంటున్నాయన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. క్రీడలు నిర్వహించే కొన్ని ప్రదేశాల్లో కనీస వసతులు కూడా ఉండటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ అకాడమీలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, అన్నింటినీ ఒకే నిబంధనల చట్రం కిందికి తీసుకువచ్చినట్లయితే సమస్య పరిష్కారమవుతుందని ఏఐటిఏ కార్యదర్శి జనరల్ హిరోణ్మయ్ ఛటర్జీ అన్నారు. అంతేకాదు అకాడమీలకు రేటింగ్‌లు కూడా ఇస్తారు. ఫలితంగా తాము ఎక్కడ, ఏవిధంగా ఆడుతున్నదీ క్రీడాకారులకు స్పష్టంగా తెలుస్తుందని ఆయన అన్నారు. క్రీడల నిర్వహణ ఒక వ్యాపారంగా మారిపోయింది. ఉదాహరణకు ఒక సూపర్ సిరీస్ టోర్నమెంట్ నిర్వహణకు, ఆర్గనైజర్‌కు కనీసం 100 ఎంట్రీలు వస్తాయి. ఎంట్రీ ఫీజు రూ.500. ఆవిధంగా వారు రూ.50,000 సంపాదిస్తారు. ఇక మ్యాచ్ నిర్వహణకు రూ.15,000కు మించి ఖర్చు కాదు. రూ.35,000 లాభంగా మిగులుతుంది. ఒక ఆర్గనైజర్ ఏడాదిలో 25 క్రీడలు నిర్వహిస్తే అతని ఆదాయం ఎంత ఉంటుందో మీరే లెక్కించండి అని ఛటర్జీ అన్నారు. అందుకనే రేటింగ్ ఇవ్వడం. ఈ రేటింగ్‌ను కోర్టుల సంఖ్య, ఎఐటిఏ రిజిస్టర్డ్ క్రీడాకారులు, సర్టిపైడ్ కోచ్‌లు,కేంద్రంలో ఉండే శిక్షకులను బట్టి ఇస్తారు.
5-10 పాయింట్ల రేటింగ్‌లో ఉండే అకాడమీలకు సింగిల్ స్టార్ రేటింగ్ ఇస్తారు. 11-14 మధ్య రేటింగ్ ఉంటే డబుల్ స్టార్, 15 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన అకాడమీలకు త్రిబుల్ స్టార్ ర్యాంకు ఇస్తారు. ఈ రేటింగ్‌లను ఏడాది కాలం ఆయా అకాడమీల పనితీరును పరిశీలించిన తర్వాత మాత్రమే ఇస్తారు. ఒక్కసారి రేటింగ్ పొందిన అకాడమీ, తన రేటింగ్ మార్పుకోసం 12 నెలల తర్వాతనే దరఖాస్తు చేసుకోవాలి.