క్రీడాభూమి

రాయల్ చాలెంజర్స్‌కు ఆకుపచ్చ జర్సీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 13 : విరాట్‌కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన సహచర టీం సభ్యులు, ‘గ్రీన్ జర్సీలు’ ధరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘గోగ్రీన్’ పిలుపు మేరకు, వీరంతా గ్రీన్ జర్సీలు ధరిస్తారు. వచ్చే ఏప్రిల్ 15న జరిగే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ ‘గ్రీన్ జర్సీలు’ ధరించి ఆడతారు. ఏటా ‘గోగ్రీన్’ ప్రేరణ కింద విరాట్ కోహ్లీ ప్రత్యర్థి టీ కెప్టెన్‌కు ఆకుపచ్చని మొక్కను ఇవ్వడం ఒక రిజాజుగా మారింది. అంతేకాదు జెర్సీ వెనుకభాగంలో ఉండే ఆటగాళ్ల పేర్లను ట్విట్టర్ హ్యాండ్లర్లు తొలగిస్తారు. ఆర్‌సిబి మరియు నువుకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ల మధ్య టై-అప్ ప్రకటన సందర్భంగా, ఈ అంశాన్ని ప్రకటించారు. ఇప్పుడు నువుకో విస్టాస్ కంపెనీ జెర్సీల వెనుక భాగంపై పూర్తి హక్కులను కలిగివుంది. తాము తయారుచేస్తున్న ‘దౌగార్డ్ సిమెంట్’ ప్రకటనను ఆటగాళ్లు ధరించే జెర్సీల వెనుకభాగంలో ఉంచాల్సి ఉంది. ‘‘ ప్రతి సీజన్‌లో ఒక గేమ్‌ను, రీసైక్లిక్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఆకుపచ్చని జెర్సీ ధరించి ఆడాలన్న ఆర్‌సీబీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం,’’ అని సేల్స్ మార్కెటింగ్ విభాగ అధిపతి మధుమిత బసు పేర్కొన్నారు.