క్రీడాభూమి

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్‌గా అమోల్ మజుందార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మార్చి 13: రానున్న ఐపీఎల్‌లో పాల్గొనే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ అమోల్ మజుందార్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం మంగళవారం వెల్లడించింది. క్రికెట్‌లో బాగా రాటుదేలిన అనుభవం కలిగిన మజుందార్ తమ టీమ్‌లో యువ క్రికెటర్లకు, తద్వారా జట్టుకు చాలా మేలు జరుగుతుందని ఫ్రాంచైజీ అభిప్రాయపడింది. అతని నియామకం ఖరారు కావడంతో మంగళవారం నుంచి ఇక్కడి సవాజీ మాన్‌సింగ్ స్టేడియంలో నిర్వహించే జట్టు తొలి శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొంటాడు. కాగా, తన ఎంపిక పట్ల మజుందార్ రాజస్థాన్ రాయల్స్ వంటి పెద్ద జట్టలో తగిన ప్రాధాన్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన అనుభవాలను రంగరించి జట్టును విజయపథంలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నాడు. రెండు దశాబ్దాల తన క్రీడా జీవితంలో ఆడిన ఎన్నో ఇన్నింగ్స్‌లలో మజుందార్ పలు రికార్డులను సృష్టించాడు. ముంబయి జట్టులో చేరిన ప్రథమార్థంలోనే సంచలన క్రికెటర్‌గా పేరు సంపాదించాడు. మొత్తం 171 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మజుందార్ 30 సెంచరీలు, 60 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. ముంబయి రంజీట్రోఫీకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.