క్రీడాభూమి

షమీ భార్య అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 13: తన భర్త టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై చేసిన సంచలన ఆరోపణల తర్వాత తరుచూ వార్తల్లో నిలుస్తున్న హసీన్ జహాన్..తాజాగా మీడియాపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. తనకు విలేఖరుల నుంచి ఎదురవుతున్న పలు ప్రశ్నల నేపథ్యంలో జహాన్ అతిగా ప్రవర్తించింది. నగరంలోని సెయింట్ సెమాస్టియన్స్ స్కూల్ ఆవరణలో జర్నలిస్టులు ఆమెను వీడియో చిత్రీకరించే క్రమంలో కెమెరా లాక్కుని పగలగొట్టింది. అదే సమయంలో గట్టిగా అరుస్తూ తన కారులో వెళ్లిపోయింది. గత కొన్ని రోజులుగా మీడియా ముందుకొచ్చి కూల్‌గా సమాధానాలిచ్చిన జహాన్ ఈరోజు మాత్రం సహనం కోల్పోయి ప్రవర్తించడం చర్చానీయాంశంగా మారింది. ఇదిలాఉంచితే తనకు అండగా నిలుస్తున్న స్నేహితులకు షమీ ధన్యావాదాలు తెలిపాడు. కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు అంటూ షమీ ట్వీట్ చేశాడు.