క్రీడాభూమి

షమీకి మరో షాక్! మొబైల్ సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 13: తన భార్యను లైంగికంగా వేధించినట్లు, అమెపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీం ఇండియా మీడియం ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే షమీ భార్య హసీన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షమీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ని సీజ్ చేశారు. షమీపై ఇప్పటికే 498ఏ, 323, 307, 376, 506, 328 సెక్షన్ల కింద కేసు నమోదైంది. తాజాగా షమీ ఫోన్‌ని సీజ్ చేసిన పోలీసులు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత షమీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. షమీకి చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఆధారాలు తన వద్ద ఉన్నాయని హసీన్ ఆరోపించిన విషయం తెలిసిందే.