క్రీడాభూమి

ఫైనల్‌కు టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: నిదహాస్ టీ-20 ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేయగా, అందుకు ధీటుగా ఆడిన బంగ్లాదేశ్ ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకుంది. భారత టీమ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 89 పరుగులు చేయగా, ప్రత్యర్థి టీమ్‌లో వికెట్ కీపర్ ముష్‌ఫికర్ రహీం అత్యధికంగా 72 పరుగులు చేశాడు. భారత జట్టు బౌలర్ వాషింగ్టన్ సుందర్ ప్రత్యర్థి జట్టులో మూడు కీలక వికెట్లు తీసి చావుదెబ్బ తీశాడు. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. భారత జట్టులో జయదేవ్ ఉనద్కత్‌ను తప్పించి అతని స్థానంలో మహ్మద్ సిరాజుద్దీన్‌కు చోటు కల్పించగా, బంగ్లాదేశ్ జట్టులో అబూ హైదర్ స్థానంలో తస్కిన్ అహ్మద్‌కు చోటు కల్పించారు. ఈ రెండు జట్లు కేవలం ఒక్కో మార్పుతోనే బరిలోకి దిగాయి. టీ-20 సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఘన విజయం సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా బ్యాటింగ్‌ను ప్రారంభించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ తన బ్యాట్‌కు పదును చెప్పాడు. టీ-20 ముక్కోణపు టోర్నీ తొలినుంచి కూడా తడబడిన రోహిత్ బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ దూకుడు కనిపించింది. వరుసగా విఫలమవుతూ ఇంటాబయట అనేక విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ కీలకంగా మారాడు. టీమిండియా కెప్టెన్ 61 బంతులు ఎదుర్కొని ఐదు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 89 పరుగులు చేశాడు. మరో 11 పరుగులు చేస్తే సెంచరీ చేసే అవకాశం ఉన్నా అతని దూకుడుకు రూబెల్ రనౌట్ ద్వారా కట్టడి చేశాడు. శిఖర్ ధావన్ 27 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఐదు బౌండరీలతో 35 పరుగులు చేసి రూబెల్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. సురేష్ రైనా 30 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో అర్ధ శతకానికి చేరువలో 47 పరుగుల వద్ద రూబెల్ బౌలింగ్‌లో సౌమ్యా సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ రెండు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో రూబెల్ హొసాన్ నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం ప్రత్యర్థి జట్టు విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టులో తమీమ్ ఇక్బాల్ 19 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, నాలుగు బౌండరీల సహాయంతో 27 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. లిటోన్ దాస్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఏడు పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మురళీ కార్తీక్‌కు చేతిలో స్టంప్ అవుట్ అయ్యాడు. సౌమ్యా సర్కార్ మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి వాషింగ్టన్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ మహ్మదుల్లా ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 11 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. షబ్బీర్ రహ్మాన్ 23 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీలతో 27 పరుగులు చేసి ఎస్.ఎన్.్ఠకూర్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. మెహిదీ హసన్ ఆరు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఏడు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ ముష్‌ఫికర్ రహీం 55 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఎనిమిది బౌండరీలతో 72 పరుగులు చేశాడు. ్రఅయనా అతనికి సహచర బ్యాట్స్‌మెన్‌ల నుండి సరైన సహకారం లేకపోవడంతో ఒక్కటే ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఇపుడు కూడా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరివరకూ నాటౌట్ నిలిచి ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు. శీలంకతో జరిగిన మ్యాచ్‌లో ముష్‌ఫికర్ రహీం అత్యధిక పరుగులు చేశాడు. అబూ హైదర్ రోనీ పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లలో 50 పరుగులిచ్చి ఒక వికెట్, శ్రాద్ధూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి ఒక వికెట్, యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్: (20 ఓవర్లలో 176/3). శిఖర్ ధావన్ బి రూబెల్ 35, సురేష్ రైనా సి సౌమ్యా సర్కార్ బి రూబెల్ 47, రోహిత్ శర్మ రనౌట్ 89.
బంగ్లాదేశ్: (20 ఓవర్లలో 159/6) తమీమ్ ఇక్బాల్ బి వాషింగ్టన్ సుందర్ 27, లిటోన్ దాస్ స్టంప్డ్ కార్తీక్ బి వాషింగ్టన్ సుందర్ 7, సౌమ్యా సర్కార్ బి వాషింగ్టన్ సుందర్ 1, మహ్మదుల్లా సి కేఎల్ రాహుల్ బి యుజ్వేంద్ర చాహల్ 11, షబ్బీర్ రహ్మాన్ బి ఎస్.ఎన్.్ఠకూర్ 27, మెహిదీ హసన్ సి సురేష్ రైనా బి సిరాజ్ 7, ముస్త్ఫికర్ రహీమ్ నాటౌట్ 72, అబూ హైదర్ రోనీ నాటౌట్ 0.
చిత్రాలు..బంగ్లాదేశ్ బౌలింగ్‌ను ధాటిగా ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ
*బంగ్లాదేశ్‌పై గెలిచిన ఆనంద క్షణాలను పంచుకుంటున్న టీమిండియా క్రికెటర్లు