క్రీడాభూమి

రెండో వనే్డలోనూ భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, మార్చి 15: దక్షిణాఫ్రికాపై విజయాలతో జోరుమీదున్న భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న ఐసీసీ చాంపియన్‌షిప్‌లో వనే్డ సిరీస్‌ను చేజార్చుకుంది. తొలి ఓటమిని చవిచూసిన టీమిండియా గురువారం జరిగిన రెండో వనే్డలోనూ ఏమాత్రం ప్రతిఘటించకలేక చతికిలపడింది. ఇక్కడి రిలయన్స్ స్టేడియంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ చాంపియన్‌షిప్ టోర్నీలో టీమిండియా ఘోరంగా ఓటమిచెందింది. 2-0తో సిరీస్‌ను ప్రత్యర్థి జట్టు కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే టీమిండియా సిరీస్‌ను చేజార్చుకుంది. మూడు వనే్డల సిరీస్‌లో భాగంగా గురువారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వనే్డ జరిగింది. ఈ వనే్డలో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమిపాలవడంతో పాటు సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకోలేకపోయింది. తొలుత టాస్ గెలిచి భారత్ బౌలింగ్‌ను ఎంచుకుంది. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు విసిరిన సవాల్‌ను స్వీకరించలేక భారత్ బోల్తాపడింది. 49.2 ఓవర్లలో కేవలం 227 పరుగులు చేసి ఆలౌటై 60 పరుగులతో తేడాతో ఓటమిని మూటకట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ ఓపెనర్లు జట్టును శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ నికోల్ బోల్టన్ 84 పరుగులు, ఎలైస్ పెర్రీ 70 పరుగులు (నాటౌట్), బెత్ మూనీ 56 పరుగులతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆసిస్ జట్టులో నికోల్ బోల్టన్ 88 బంతులు ఎదుర్కొని 12 బౌండరీలతో 84 పరుగులు చేసి ఏక్తా బిస్త్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయింది. వికెట్ కీపర్ అలైస్సా హేలీ 37 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 19 పరుగులు చేసి పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో వేదా కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 43 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 24 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్‌లో పూనమ్ రౌత్‌కు క్యాచ్ ఇచ్చింది. రేచల్ హేన్స్ మూడు బంతులు ఎదుర్కొని హర్మన్‌ప్రీత్ కౌర్ చేతిలో బౌల్డ్ అయింది. బెత్ మూనే 40 బంతులు ఎదుర్కొని తొమ్మిది బౌండరీలతో 56 పరుగులు చేసి శిఖాపాండే బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చింది. యాష్‌లెగ్ గార్డెనర్ ఆరు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఆరు పరుగులు చేసి పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో సుష్మా వర్మ ఆమెను స్టంపవుట్ చేసింది. నికోల్ కారే 11 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 16 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్‌లో వేదా కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. జెస్సీ జొనాసెన్ రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి మిథాలిరాజ్ చేతిలో రనౌట్ అయింది. అమందా వెల్లింగ్టన్ పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయింది. ఎలైస్ పెర్రీ 70 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఆరు బౌండరీలతో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మెగాన్ స్కట్ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీసుకుంది. ఈమె 10 ఓవర్లలో 61 పరుగులిచ్చింది. పూనమ్ యాదవ్ 10 ఓవర్లలో 52 పరుగులిచ్చి రెండు వికెట్లు, ఏక్తా బిస్త్ 10 ఓవర్లలో 55 పరుగులిచ్చి ఒక వికెట్, హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
ఆ తర్వాత నిర్ణీత 288 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ తొలినుంచే తడబడింది. 88 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. జట్టులో స్మృతి మంధాన (67 పరుగులు) తప్ప మిగతా బ్యాట్స్‌మన్‌లెవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. పూనమ్ రౌత్ 61 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 27 పరుగులు చేసి గార్డెనర్ బౌలింగ్‌లో అమందా వెల్లింగ్టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. స్మృతి మంధాన 53 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, 12 బౌండరీలతో 67 పరుగులు చేసి జొనాసెన్ బౌలింగ్‌లో స్కట్‌కు క్యాచ్ ఇచ్చింది. దీప్తి శర్మ 45 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 26 పరుగులు చేసి జొనాసెన్ బౌలింగ్‌లో లానింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. కెప్టెన్ మిథాలి రాజ్ 14 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 15 పరుగులు చేసి ఈ.పెర్రీ బౌలింగ్‌లో అలైస్సా హీలేకు క్యాచ్ ఇచ్చింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 26 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 17 పరుగులు చేసి అమందా వెల్లింగ్టన్ బౌలింగ్‌లో అలైస్సా హీలేకి క్యాచ్ ఇచ్చి వెనుకకు వెళ్లింది. వేదా కృష్ణమూర్తి ఐదు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి అమందా వెల్లింగ్టన్ బౌలింగ్‌లో అలైస్సా హీలే బౌలింగ్‌లో స్టంపవుట్ అయింది. వికెట్ కీపర్ సుష్మా వర్మ 12 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీలో ఎనిమిది పరుగులు చేసి జొనాసెన్ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చింది. శిఖా పాండే 19 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 15 పరుగులు చేసి నికోలా కారే బౌలింగ్‌లో జొనాస్సెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. పూజా వస్త్రాకర్ 33 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీల సహాయంతో 30 పరుగులు చేసి స్కట్ బౌలింగ్‌లో అలైస్సా హీలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. పూనమ్ యాదవ్ తొమ్మిది బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి పెర్రీ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ అయింది. ఏక్తా బిస్త్ 20 బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.ఆసిస్ బౌలర్లలో జెస్ జొనాసెన్ 10 ఓవర్లలో 51 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుంది. ఎలైసె పెర్రీ 8.2 ఓవర్లలో 41 పరుగులిచ్చి రెండు వికెట్లు, అమందా వెల్లింగ్టన్ నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. మెగాన్ స్కట్ 10 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఒక వికెట్, యాష్‌లెల్గ్ గార్డెనర్ 10 ఓవర్లలో 44 పరుగులిచ్చి ఒక వికెట్, నికోలా కారే ఏడు ఓవర్లలో 51 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. ఆసిస్ బౌలర్ల ధాటికి టీమిండియా 49.2 ఓవర్లలో 227 పరుగులకే కుప్పకూలి విలవిల్లాడింది. దీంతో 60 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక సిరీస్‌లో మూడోది, నామమాత్రమైన మ్యాచ్ ఆదివారం జరుగనుంది. మ్యాచ్‌లో ఆసిస్ క్రికెటర్ నికోల్ బోల్టన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా: (50 ఓవర్లలో 287/9). నికోల్ బోల్టన్ ఎల్‌బీడబ్ల్యూ ఏక్తా బిస్త్ 84, అలైస్సా హీలే సి వేదా కృష్ణమూర్తి బి పూనమ్ యాదవ్ 19, మెగ్ లానింగ్ సి పూనమ్ రౌత్ బి శిఖా పాండే 24, రేచల్ హేన్స్ బి హర్మన్‌ప్రీత్ కౌర్ 0, బెత్ మూనే సి అండ్ బి శిఖా పాండే 56, యాష్‌లెల్గ్ గార్డెనర్ స్టంప్‌డ్ సుష్మా వర్మ బి పూనమ్ యాదవ్ 6, నికోలా కారే సి వేదా కృష్ణమూర్తి బి శిఖా పాండే 16, జెస్ జొనాసెన్ రనౌట్ (మిథాలీ రాజ్) 1, అమందా వెల్లింగ్టన్ రనౌట్ (పూజా వస్త్రాకర్/దీప్తి శర్మ) 0, ఎలైసే పెర్రీ నాటౌట్ 70, మెగాన్ స్కట్ నాటౌట్ 0. ఎక్స్‌ట్రాలు 11.
భారత్: (49.2 ఓవర్లలో 227 ఆలౌట్). పూనమ్ రౌత్ సి అమందా వెల్లింగ్టన్ బి గార్డెనర్ 27, స్మృతి మంధాన సి స్కట్ బి జొనాసెన్ 67, దీప్తి శర్మ సి లానింగ్ బి జొనాసెన్ 26, మిథాలీ రాజ్ సి అలైస్సా హీలే బి ఈ.పెర్రీ 17, వేదా కృష్ణమూర్తి స్టంప్‌డ్ అలైస్సా హీలే బి అమందా వెల్లింగ్టన్ 2, సుష్మా వర్మ సి అండ్ బి జొనాసెన్ 8, శిఖా పాండే సి జొనాసెన్ బి నికోలా కారే 15, పూజా వస్త్రాకర్ సి అలైస్సా హీలే బి స్కట్ 30, పూనమ్ యాదవ్ ఎల్‌బీడబ్ల్యూ ఈ.పెర్రీ 3, ఏక్తా బిస్త్ నాటౌట్ 8. ఎక్స్‌ట్రాలు 9.

చిత్రాలు..భారత్‌పై అర్ధ సెంచరీ సాధించిన అనంతరం తన బ్యాట్‌ను చూపుతున్న ఆసీస్ క్రికెటర్ బెత్ మూనే
*ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ మ్యాచ్‌లో షాట్ కొడుతున్న టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన