క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ రెండోరోజు తెలుగు తేజం, బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దూసుకెళ్తోంది. గురువారం జరిగిన పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన నిట్సాన్ జిందాపోల్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. సింధూ 21-13, 13-21, 21-18 సెట్ల వ్యత్యాసంతో జిందాపోల్‌పై విజయం సాధించింది. జపాన్‌కు చెందిన ఓకుహరా, ఇండోనేషియాకు చెందిన ఫిత్రియానీల మధ్య జరిగే పోరులో గెలుపొందే క్రీడాకారిణితో సింధు క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. చాంపియన్‌షిప్ మొదటిరోజు ఆటలో భారత్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో మాజీ రన్నరప్ సైనానెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా, ప్రపంచ మూడో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, పీవీ.సింధు మూడు గేమ్‌లపాటు కష్టపడి గట్టెక్కారు. థాయ్‌లాండ్‌కు చెందిన నిట్చాన్ జిందాపోల్‌తో తలపడిన సింధు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.
మూడుసెట్ల పాటు కొనసాగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-13 స్కోరు తేడాతో ఆధిక్యాన్ని కనపరిచిన్నప్పటికీ, రెండోసెట్‌లో 13-21 తేడాతో వెనుకపడటంతో ఇద్దరి స్కోరు 1-1తో ఉండడంతో సమఉజ్జీవులుగా నిలిచారు. దీంతో ఇద్దరికీ మూడో సెట్ గేమ్ కీలకంగా మారింది. సింధు పట్టుదలతో ఆడుతూ ప్రత్యర్థి షాట్‌లను నిలువరిస్తూ పాయింట్లు సాధించింది. మూడో సెట్ ఆట ముగిసేసరికి సింధు 21-18 స్కోరు తేడాతో ప్రత్యర్థిపై పట్టు సాధించి విజయం సాధించింది. సింధు ఇదే తరహాలో క్వార్టర్ ఫైనల్లో రాణిస్తే భారత్‌కు టైటిల్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది.