క్రీడాభూమి

నివేదిక తర్వాత చర్య: బీసీసీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టీం ఇండియా ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇతర అమ్మాయిలతో ఆక్రమ సంబంధాలు ఉన్నట్లు, తనపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం చేసినట్లు షమి భార్య హసీన్ జహాన్ ఆరోపించడంతో షమిని కాంట్రాక్ట్ క్రికెటర్ల జాబితాలోంచి బీసీసీఐ తొలగించింది. తాజాగా షమి ఐపీఎల్ భవిష్యత్తుపై కూడా ఈ కేసు ప్రభావం కనిపించే అవకాశం ఉంది. షమి దుబాయ్‌లో మహ్మద్ భాయి అనే వ్యక్తి ద్వారా పాకిస్తాన్‌కి చెందిన ఓ అమ్మాయి పంపిన డబ్బు తీసుకున్నాడని హసీన్ ఫిర్యాదు చేసింది. షమీపై విచారణ జరపాల్సిందిగా సంస్థ అవినీతి నిరోధక శాఖను కోరింది. దీంతో షమి ఐపీఎల్‌లో కొనసాగుతాడా లేదా..అని అవినీతి నిరోధక శాఖ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సీకే.ఖన్నా తెలిపారు. సీఓఏ చీఫ్ వినోద్‌రాయ్ అదేశాలమేరకు ఆ శాఖ చీఫ్ నీరజ్‌కుమార్ షమి కేసును విచారిస్తున్నారు. దీనిపై ఆయన ఏడురోజుల్లో నివేదిక ఇస్తారని, ఆ తర్వాత షమి విషయంలో బీసీసీఐ ఓ క్లారిటీకి వస్తుందని పేర్కొన్నారు.