క్రీడాభూమి

ఎఫ్‌ఐఆర్ కాపీని బీసీసీఐకి పంపిన షమి భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 16: టీమిండియా ఏసర్ మహ్మద్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ గత వారం కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు గృహహింస, హత్యాయత్నంతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద షమితో పాటు మరో నలుగురిపై తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కాపీని బీసీసీఐకి పంపిన్నట్లు ఆమె తరపు న్యాయవాది జాకీర్ హుస్సేన్ తెలిపారు. గురువారం కోల్‌కతా పోలీస్టేషన్‌లో షమిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కాపీని సీఓఏ చైర్మన్ వనోద్ రాయ్‌కి పంపించాం అని న్యాయవాది తెలిపారు.
ఒక మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు పాకిస్తాన్ అమ్మాయి ద్వారా షమి డబ్బు తీసుకున్నట్లు షమి భార్య హసీన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై దృష్టి సారించిన సీఓఏ దీనిపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చైర్మన్ నీరజ్ కుమార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జకీర్ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కాపీని పంపినట్లు తెలుస్తోంది. హసీన్ తనపై చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై షమి స్పందించాడు. విచారణలో తాను ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలితే ఉరితీయండి అని కన్నీటి పర్యంతమయ్యాడు. బీసీసీఐ తొందరపడి నా కాంట్రాక్ట్‌ను రద్దుచేసింది. నేనెప్పుడూ నిజాయితీగానే ఆడాను అని షమి ఆవేదన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.