క్రీడాభూమి

వార్న్ గొప్పదనం అదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: దిగ్గజ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ కోచ్ షేన్‌వార్న్ జట్టు నుంచి అత్యత్తుమ ప్రదర్శిన వెలికితీస్తాడని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తొలి ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్‌ను విజేతగా నిలిపిన వార్న్ సారథ్యంలో కైఫ్ ఆడిన సంగతి తెలిసిందే. షేన్‌వార్న్‌కు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయి. ఆటగాడిలో ఎలాంటి సత్తా ఉందో వెంటనే గుర్తిస్తాడు. బ్యాట్స్‌మన్, బౌలర్లు, ఫీల్డర్లు, వికెట్ కీపర్ నుంచి అత్యత్తుమ ఆటతీరును వెలికితీస్తాడు అని కైఫ్ అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ జట్టు టాప్ 4లో ఉంటుందని ఆయన అంచనా వేశాడు. గేమ్ ప్లాన్ ఇన్ యూవర్ సిటీ కార్యక్రమంలో భాగంగా వందలాది విద్యార్థులతో సమావేశమైన కైఫ్ మాట్లాడాడు. రాజస్థాన్ రాష్ట్రంలో ఎదుకుతున్న యువ క్రికెటర్లు కమలేశ్ నాగర్ కోటి, అహ్మద్ సల్మాన్ ఖాన్ గురించి కైఫ్ మాట్లాడాడు. వారిన సరైన దిశగా నడిపించే, మార్గనిర్దేశం చేసే వారు అవసరమని పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి తాను అండర్-19 క్రికెట్ అడేటప్పుడు చాలామంది సీనియర్లు వచ్చి ప్రోత్సహించేవారని పేర్కొన్నాడు. నిలకడగా రాణించలేకపోవడం వల్లే ఐపీఎల్‌లో ఒక సీజన్ అత్యధిక ధర పలికిన ఆటగాడు మరో సీజన్‌లో సత్తా లేకుండా పోతున్నాడని తెలిపాడు. గతేడాది ఇంగ్లాండ్ స్పిన్నర్ తైమల్ మిల్స్‌ను బెంగుళూరు రూ.12 కోట్లకు కొనుగోలు చేయగా, ఈసారి అతడిని కొనుగోలు చేసేందుకు వేలంలో ఎవరూ ఆసక్తి చూపలేదని ఉదహరించాడు. రాజస్థాన్ రాయల్స్ సమతూకంతో ఉందని వెల్లడించాడు.