క్రీడాభూమి

యువరాజ్ రికార్డు బద్దలుగొట్టిన రోహిత్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మార్చి 16: ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న టీమిండియా టీ-20 కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 61 బంతుల్లో 5 బౌండరీలు, 5 సిక్సర్లతో 89 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును అతను బద్దలుగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఐదు సిక్సర్లు బాదిన రోహిత్ టీ-20ల్లో తన సిక్సర్లను 75కి పెంచుకున్నాడు. ఫలితంగా టీ-20లోల అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 74 సిక్సర్లలో యువరాజ్ సింగ్ రెండో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయంగా క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్ 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా టూర్‌లో ఘోరంగా విఫలమైన రోహిత్ శర్మ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు (నిదహాస్) టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌ల్లోనూ విఫమయ్యాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం మునుపటి ఫామ్‌ను ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది.