క్రీడాభూమి

ఫైనల్లో పోరాడి ఓడిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, మార్చి 17: ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో తెలుగుతేజం పీవీ సింధు పరాజయం పాలైంది. ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి జపాన్‌కు చెందిన యమగూచి ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో మూడో సీడ్ సింధు 21-19, 19-21, 18-21 తేడాతో ప్రత్యర్థి రెండో సీడ్ యమగూచి చేతిలో ఓటమిపాలైంది. అత్యంత ఉత్కంఠభరిత సాగిన ఈ మ్యాచ్ 80 నిమిషాలపాటు కొనసాగింది. మొదటి సెట్‌లో సింధు చక్కటి ఆటతీరును ప్రదర్శించి 21-19 తేడాతో కైవసం చేసుకుంది. తిరిగి రెండో సెట్‌లో 19-21 తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడో సెట్ ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది. నువ్వానేనా అన్నట్టు కొనసాగిన మూడో సెట్ చివరికి యమగూచిని వరించింది. 18-21 తేడాతో సింధు పరాజయం పాలవడంతో ప్రత్యర్థికి ట్రోఫీ వశమైంది. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య జరిగిన పది మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌లలో సింధు గెలవగా, నాలుగు మ్యాచ్‌లను యమగూచి గెల్చుకోవడం విశేషం. మంచి ఫాంతో ఫుల్ జోష్ మీదున్న యమగూచి ఫైనల్ మ్యాచ్‌లో సింధుపై ప్రతీకారం తీర్చుకుని టైటిల్‌ను చేజిక్కించుకుంది. సింధుపై ఎంతో ఆశలు పెట్టుకున్న భారత క్రీడాభిమానులకు నిరాశనే మిగిలింది. ఆల్ ఇంగ్లాండ్ టోర్నీపై తాజాగా ప్రస్తుతం మూడో టాప్‌సీడ్ క్రీడాకారిణి, భారత్ స్టార్ షట్లర్ పీవీ.సింధు ఆశలు నింపుతుందనుకున్న తరుణంలో యమగూచి చేతిలో ఓటమిపాలైంది. శుక్రవారం ఏడో సీడ్ క్రిడాకారిణి జపాన్‌కు చెందిన నొజొమి ఒకుహరతో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 20-22, 21-18, 21-18 స్కోరుతో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో తొలిసారి క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ సింధు, ద్వితీయ సీడ్ అకాని యమగూచితో తలపడింది. అయితే ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య సాగిన పోరులో సింధుదే ఆధిక్యం కావడం విశేషం. వీరిద్దరూ పదిసార్లు తలపడగా, అందులో సింధు ఆరుసార్లు, యమగూచి నాలుగుసార్లు మాత్రమే ఒకరిపై ఒకరు విజయం సాధించారు. తాజాగా 2018 ఫిబ్రవరిలో బాడ్మింటన్ ఆసియా టీం చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ తలపడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లో సింధుకు రెండో సెట్‌లోపే మ్యాచ్‌ను ముగించింది. మొదటి సెట్‌ను 21-19తో, 21-19తో రెండో సెట్‌లో సింధు గెలుపొంది మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇక అంతకుముందు 2017 దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్లో మాత్రం సింధు, యమగూచి ముందు తలవంచాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 21-15తో కైవసం చేసుకున్న సింధు, రెడో సెట్‌ను 12-21 తేడాతో కోల్పోయింది. ఇక కీలక మూడో సెట్ హోరాహోరిగా సాగినా యమగూచి దూకుడుగా ఆడి 19-21 తేడాతో సరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 2017 హాకాంగ్ ఓపెన్‌లోనూ సింధు 21-12, 21-19 తేడాతో రెండో సెట్‌లోపే యమగూచిని ఓడించింది. అయితే మొదటి సారిగా వీరిద్దరి మధ్య జరిగిన పోరులో మాత్రం యమగూచిదే విజయం. 2013 జపాన్‌లో యమగూచితో తలపడిన సింధు 6-21, 17-21తో ఓటమి పాలైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకతను సంతరించుకున్న ఆల్‌ఇంగ్లాండ్ మహిళల సింగిల్స్ ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో తెలుగుతేజం సింధు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

చిత్రం..ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో పీవీ సింధును ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్న యమగూచి