క్రీడాభూమి

భారత్‌కు తప్పని వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా మహిళల క్రికెట్ జట్టుకు స్వదేశంలోనే వైట్ వాష్ తప్పలేదు. మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా పరువు నిలబెడతారనుకున్న అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో గెలుపుతో ఆస్ట్రేలియా సిరీస్‌ను గెల్చుకోగా, ఫైనల్స్‌లోనూ 97 పరుగుల ఆధిక్యంతో భారత జట్టును ఓడించడం ద్వారా ఆ జట్టుదే పైచేయి అయింది.
వడోదర, మార్చి 18: ఇక్కడి రిలయన్స్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్‌షిప్‌లో మూడోది, ఆఖరిది అయిన వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో టీమిండియాకు వైట్‌వాష్ తప్పలేదు. ఇంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైనా ఫైనల్‌లోనైనా పరువు నిలబెడతారన్న క్రికెట్ క్రీడాభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మొదటి మ్యాచ్ నుంచే ప్రత్యర్థి జట్టు భారత టీమ్‌పై ఆధిపత్యం కనబరుస్తున్నా ఎక్కడో ఒక మూలన మూడో మ్యాచ్‌లోనైనా మన పరువు దక్కిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. చివరకు తుదిపోరులో ప్రత్యర్థిదే పైచేయి అయింది. 97 పరుగుల ఆధిక్యంతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి, ప్రపంచ కప్ ఫైనల్స్‌లో భారత్‌పై ఓడిపోయిన పరాభవంపై ప్రతీకారం తీర్చుకుంది. మూడు వనే్డలలో ఇప్పటికే రెండింట్లో ఘనవిజయం సాధించడం ద్వారా సిరీస్ ఆస్ట్రేలియా పరమైనా, ఆదివారం జరిగిన మూడో మ్యాచ్ నామమాత్రమైనా టీమిండియా గెలిచివుంటే పరువు కొంతవరకైనా దక్కేది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 332 పరుగులు సాధించింది. అనంతరం ప్రత్యర్థి విసిరిన నిర్దేశిత లక్ష్యం ఛేదించేందుకు బరిలో దిగిన మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు 44.4 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 97 పరుగుల ఆధిక్యత లభించింది. ఆస్ట్రేలియా జట్టులో వికెట్ కీపర్ అలైస్సా హీలే 115 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, 17 బౌండరీల సహాయంతో 133 పరుగులు సాధించింది. హీలే కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కాగా, తమ జట్టు తరఫున భారత్‌పై ఆమె అత్యిధిక స్కోరును నమోదు చేసింది. ఈ టీమ్‌లో నికోల్ బోల్టన్, కెప్టెన్ లానింగ్ తక్కువ పరుగులకే ఔటైనా అలెస్సా హీలే, ఎలైన్ పెర్రీ జట్టును కాపాడే ప్రయత్నం చేశారు. గత రెండు మ్యాచ్‌లలో భారీ పరుగులు సాధించిన నిలోల్ బోల్టన్ ఈ జట్టులో అంతగా రాణించలేకపోయింది. 18 బంతులు ఎదుర్కొన్న ఆమె ఒక బౌండరీతో 11 పరుగులు చేసి ఏక్తా బిస్త్ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 14 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 18 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో మిథాలీ రాజ్‌కు క్యాచ్ ఇచ్చింది. ఎలైసా పెర్రీ 60 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 32 పరుగులు చేసి శిఖా పాండే బౌలింగ్‌లో సుష్మా వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. వికెట్ కీపర్ అలైస్సా హీలే 115 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, 17 బౌండరీల సహాయంతో 113 పరుగులు చేసి పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో వేదా కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చింది. రేచల్ హేన్స్ 39 బంతులు ఎదుర్కొని ఐదు బౌండరీలతో 43 పరుగులు చేసి రనౌట్ అయింది. యాష్‌లీగ్ గార్డెనర్ 20 బంతులు ఎదుర్కొని ఆరు బౌండరీలతో 35 పరుగులు చేసి హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్‌లో పూనమ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. నికోల్ కారే 15 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 17 పరుగులు చేయగా ఆమెను హర్మన్‌ప్రీత్ బౌల్డ్ చేసింది. బెత్ మూనే 19 బంతులు ఎదుర్కొని ఐదు బౌండరీలతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. భారత జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్ 5.3 ఓవర్లలో 51 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకుంది. శిఖా పాండే తొమ్మిది ఓవర్లలో 61 పరుగులిచ్చి ఒక వికెట్, దీప్తి శర్మ 10 ఓవర్లలో 50 పరుగులిచ్చి ఒక వికెట్, ఏక్తా బిస్త్ 7.3 ఓవర్లలో 38 పరుగులిచ్చి ఒక వికెట్, పూనమ్ యాదవ్ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం ప్రత్యర్థి విసిరిన భారీ లక్ష్యం ఛేదనకు బరిలోకి దిగిన భారత జట్టు 44.4 ఓవర్లలో 235 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు జమీమా రోడ్రిగ్స్ (42), స్మృతి మంధాన (52) ఆకట్టుకుని తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. అయితే, వీరిద్దరూ వెంటవెంటనే పెవిలియన్ దారిపట్టడంతో భారత్‌కు కష్టకాలం ఎదురైంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (21), హర్మన్‌ప్రీత్ కౌర్ (25) ఆశించిన స్థాయిలో రాణించలేపోయినా దీప్తి శర్మ (36), సుష్మా వర్మ (30) ఫర్వాలేదనిపించారు. వీరిద్దదూ 221 పరుగుల స్కోరు వద్ద వరుసగా ఔట్ కావడంతో మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ జట్టును ఆదుకునే సాహసం చేయకపోవడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత జట్టులో జెమీమా రోడ్రిగ్స్ 41 బంతులు ఎదుర్కొని ఏడు బౌండరీలతో 42 పరుగులు చేసి గార్డెనర్ బౌలింగ్‌లో ఆర్.హేన్స్‌కు క్యాచ్ ఇచ్చింది. స్మృతి మంధాన 42 బంతులు ఎదుర్కొని 10 బౌండరీలతో 52 పరుగులు చేసి గార్డెనర్ చేతిలో ఎల్‌బీడబ్ల్యూ అయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 26 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 25 పరుగులు చేసి నికోలా కారే బౌలింగ్‌లో అలైస్సా హీలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 38 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 21 పరుగులు చేసి జొనాసెన్ బౌలింగ్‌లో ఆర్.హేన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. మోనా మెస్రమ్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి గార్డెనర్ బౌలింగ్‌లో నికోలా కారేకి క్యాచ్ ఇచ్చింది. వికెట్ కీపర్ సుష్మా వర్మ 35 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీల సహాయంతో 30 పరుగులు చేసి స్కట్ బౌలింగ్‌లో లానింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. దీప్తి శర్మ 49 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 36 పరుగులు చేసి పెర్రీ చేతిలో బౌల్డ్ అయింది. శిఖా పాండే ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఈ.పెర్రీ బౌలింగ్‌లో అలైస్సా హీలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. పూజా వస్త్రాకర్ 17 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఆరు పరుగులు చేసి స్కట్ బౌలింగ్‌లో నికోలా కారేకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. పూనమ్ పాండే 14 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఏడు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఏక్తా బిస్త్ బౌలింగ్ సమయంలో గాయపడడంతో మ్యాచ్ మధ్యలోనే ఆట నుంచి వెళ్లిపోయింది.ఆస్ట్రేలియా జట్టులో యాష్‌లెగ్ గార్డెనర్ ఎనిమిది ఓవర్లలో 40 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించింది. మెగాన్ స్కట్ 9.4 ఓవర్లలో 54 పరుగులిచ్చి రెండు వికెట్లు, ఎలైసె పెర్రీ తొమ్మిది ఓవర్లలో 40 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. జెస్ జొనాసెన్ 10 ఓవర్లలో 40 పరుగులిచ్చి ఒక వికెట్, నికోలా కారే ఐదు ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా: (50 ఓవర్లలో 332/7). నికోల్ బోల్టన్ సి అండ్ బి ఏక్తా బిస్త్ 11, అలైస్సా హీలే సి వేదా కృష్ణమూర్తి బి పూనమ్ యాదవ్ 133, మెగ్ లానింగ్ సి మిథాలీ రాజ్ బి దీప్తి శర్మ 18, ఎలైస్సా పెర్రీ సి సుష్మా వర్మ బి శిఖా పాండే 32, రేచల్ హేన్స్ రనౌట్ వేదా కృష్ణమూర్తి/సుష్మా వర్మ 43, యాష్‌లీగ్ గార్డెనర్ సి పూనమ్ యాదవ్ బి హర్మన్‌ప్రీత్ కౌర్ 35, నికోలా కారే బి హర్మన్‌ప్రీత్ కౌర్ 17, బెత్ మూనే 34 నాటౌట్. ఎక్స్‌ట్రాలు 9.
భారత్: (44.4 ఓవర్లలో 235 ఆలౌట్). జమీమా రోడ్రిగ్స్ సి ఆర్.హేన్స్ బి గార్డెనర్ 42, స్మృతి మంధాన ఎల్‌బీడబ్ల్యూ గార్డెనర్ 52, మిథాలీ రాజ్ సి ఆర్.హేన్స్ బి జొనాసెన్ 21, హర్మన్‌ప్రీత్ కౌర్ సి అలైస్సా హీలే బి నికోలా కారే 25, దీప్తి శర్మ బి పెర్రే 36, మోనా మెస్రమ్ సి నికోలా కారే బి గార్డెనర్ 1, సుష్మా వర్మ సి లానింగ్ బి స్కట్ 30, పూజా వస్త్రాకర్ సి నికోలా కారే బి స్కట్ 5, శిఖా పాండే సి అలైస్సా హీలే బి పెర్రే 0, పూనమ్ యాదవ్ 7 నాటౌట్, ఏక్తాబిస్త్ (గాయంతో వెనుతిరిగింది) 0. ఎక్స్‌ట్రాలు 15.
చిత్రం..115 బంతుల్లో 133 పర గులు చేసిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలైస్సా హీలే