క్రీడాభూమి

కశ్యప్ ఆశలకు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: రియో ఒలిపింక్స్‌లో పాల్గొనాలన్న భారత బాడ్మింటన్ వీరుడు, తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ ఆశలకు దాదాపుగా తెరపడింది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఫిట్నెస్ సమస్య అతని అవకాశాలకు గండికొట్టింద. ఈనెల మలేసియా, సింగపూర్ ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలని కశ్యప్ భావించాడు. కానీ, గాయం పూర్తిగా తగ్గకపోవడంతో అతను ఈరెండు టోర్నీల నుంచి వైదొలిగాడు. ఈ టోర్నీలో పాల్గొంటే, అతను ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. అయితే, అత్యంత కీలకమైన రెండు టోర్నీలకూ దూరం కావడం వల్ల చాలా నష్టపోయానని కశ్యప్ వాపోయాడు. మంగళవారం అతను పిటిఐతో మాట్లాడుతూ ఏప్రిల్ మొత్తం మీద తాను ఒక్క టోర్నీ కూడా ఆడలేకపోతున్నానని అన్నాడు. ఫలితంగా అత్యంత విలువైన ర్యాంకింగ్ పాయింట్లును కోల్పోతానని చెప్పాడు. ‘ఈ పరిస్థితికి నేను ఎవరినీ దోషులుగా పేర్కోవడం లేదు. నేను రియోలో ఆడాలనే అభిమానులు, అధికారులు కోరుకుంటున్నారు. కానీ, ఫిట్నెస్ సమస్య కారణంగా నేనే కీలక టోర్నీల్లో పాల్గొనడం లేదు’ అన్నాడు. త్వరలోనే కోలుకొని మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో దూసుకెళతానని ధీమా వ్యక్తం చేశాడు.

హాక్స్ బే కప్ మహిళల హాకీ
మళ్లీ ఓడిన భారత్
హాస్టింగ్స్ (న్యూజిలాండ్), ఏప్రిల్ 5: హాక్స్ బే కప్ మహిళల హాకీలో భారత జట్టు వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లను ఢీకొని ఓటమిపాలైన భారత్ మంగళవారం చైనాకు గట్టిపోటీనిచ్చింది. అయితే, అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న చైనా మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ 19వ0 నిమిషంలోనే భారత్‌కు రాణి ద్వారా గోల్ లభించింది. అయితే, కొద్ది సేపటికే చైనాకు యూ క్వియాన్ ఈక్వెలైజర్‌ను అందించింది. వాంగ్ మెంగ్యు కీలక గోల్ సాధించి చైనాను గెలిపించింది. ఈ టోర్నీలో భాగంగా ఏడో తేదీన జరిగే మ్యాచ్‌లో జపాన్‌ను భారత్ ఢీ కొంటుంది.