క్రీడాభూమి

రబడకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 20: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో అనుచిత ప్రవర్తన కారణంగా మ్యాచ్ రిఫరీ ఆగ్రహానికి గురైన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడకు ఊరట లభించింది. ఆ దేశ పేసర్ కగిసో రబడ ఆస్ట్రేలియా మిగతా రెండు టెస్టుల్లో బరిలోకి దిగేందుకు మార్గం సుగమం చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీనియర్ లాయర్ హెరాన్‌ను జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రబడపై రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసీసీ తొలగించింది. దీనిపై విచారణ చేపట్టిన సదరు కమిషన్.. ఎట్టకేలకు రబడకు అనుకూలంగా సోమవారం నివేదిక అందజేసింది. ఆసీస్ పోర్ట్ ఎలిజిబెత్ టెస్టులో 11 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రబడ.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ వికెట్ తీయగానే.. అతడ్ని భుజంతో తోసుకుంటూ ముందుకెళ్లాడు. రబడ చర్య నిబంధనలకు విరుద్ధం కావడంతో ఐసీసీ అతడికి 50 శాతం జరిమానా విధించింది. అతడి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు చేర్చింది. దానిలో సఫారీ బౌలర్ ఖాతాలో 8 డీమెరిట్ పాయింట్లను దాటడంతో అతడిపై రెండు టెస్టుల నిషేధం విధించింది. దీనిపై రబడ ఐసీసీకి అప్పీల్ చేసుకోగా న్యూజిలాండ్‌కు చెందిన మైకెల్ హెరాన్‌ను జ్యుడీషియల్ కమిషనర్‌గా నియమించింది. రబడకు విధించిన డీమెరిట్ పాయింట్లను మూడు నుంచి ఒకటికి తగ్గించారు. దీంతో అతడు మిగతా టెస్టుల్లో బరిలో దిగడానికి మార్గం సుగమమైంది. అదే సమయంలో మ్యాచ్ ఫీజులో విధించిన కోతను సైతం 5వ శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు.