క్రీడాభూమి

కోలుకుంటున్న నేమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, మార్చి 21: భారీ ధరకు బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జర్మెయిన్ (పీఎస్‌జీ)కి తరలి వెళ్లిన బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్ వేగంగా కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు డాక్టర్ రాడ్రిగో లాస్మర్ ప్రకటించాడు. కాలి గాయంతో బాధపడుతున్న నేమార్‌కు ఈనెల మూడో తేదీన శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అతను వేగంగా కోలుకుంటున్నాడని, త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని లాస్మర్ చెప్పాడు. రష్యాలో ఈ ఏడాది జూన్ 14 నుంచి మొదలయ్యే ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో బ్రెజిల్ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉంటాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.