క్రీడాభూమి

కౌంటీ ఆఫర్లు వచ్చాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 22: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మొదటి రోజున తనకు అవకాశం దక్కకపోవడంతో ఇంగ్లీష్ కౌంటీలో ఆడాల్సిందిగా ఆఫర్లు వచ్చాయని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ అన్నాడు. గురువారం ఇక్కడ జరిగిన జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న అతను మాట్లాడుతూ, మొదటి రోజు వేలంలో తనను ఎవరూ కొనుగోలు చేయని విషయాన్ని ప్రస్తావించాడు. తొలి రోజు వేలం ప్రక్రియ పూర్తయిన వెంటనే పలువురు తనను సంప్రదించారని, ఇంగ్లీష్ కౌంటీలకు ఆఫర్లు ఇచ్చారని చెప్పాడు. అయితే, వేలం రెండో రోజున చెన్నై సూపర్ కింగ్స్ తనను కొనుక్కోవడం ఎంతో ఆనందానిచ్చిందని అన్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో చెన్నై తరఫున ఆడిన విజయ్ ఆతర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వంటి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. తిరిగి చెన్నైకి రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తున్నదని, ఒక రకంగా ఇది తన అదృష్టమని విజయ్ అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, దక్షిణాఫ్రికాలో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో రాణించిందన్నాడు. టెస్టు ఫార్మాట్‌లోనే కొంత వెనుకబడిందన్నాడు. టీ-20 మ్యాచ్‌ల్లోనూ రాణించగలిగే సత్తా తనకు ఉందని మరో ప్రశ్నపై స్పందిస్తూ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లీష్ కౌంటీలు లేదా ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ వంటి టోర్నీల్లో పాల్గొనే అవకాశాలను ప్రస్తావించగా, వాటిపై ఇప్పుడే సమాధానం చెప్పలేనని అన్నాడు. తాను ప్రొఫెషనల్ క్రికెటర్‌నని, కాబట్టి, ఎక్కడైనా, ఎలాంటి ఫార్మాట్‌లోనైనా ఆడగలనని చెప్పాడు. ముంబయి ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు ఎన్నో చిరస్మరణీయ అనుభవాలను సంపాదించుకున్నానని అన్నాడు. యువ క్రికెటర్లు తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి ఐపీఎల్‌ను మించిన వేదిక లేదని విజయ్ వ్యాఖ్యానించాడు.