క్రీడాభూమి

వేటుకు రంగం సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రేప్ కేసు దాఖలు కావడంతో సౌమ్యజిత్ ఘోష్‌ను సస్పెండ్ చేయడానికి భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) రంగం సిద్ధం చేసుకుంది. అర్జున అవార్డు గ్రహీత ఘోష్‌పై 18 ఏళ్ల యువతి చేసిన ఫిర్యాదుపై సమాఖ్య తీవ్రంగా స్పందించింది. అతనిని కామనె్వల్త్ గేమ్స్‌కు వెళ్లే భారత టీటీ బృందం నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. వివరాల కోసం ఎదురుచూస్తున్నామని, అతనిపై వేటు పడడం ఖాయమని సమాఖ్య కార్యదర్శి ఎంపీ సింగ్ అన్నాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో ఆడే టీటీ బృందంలో ఘోష్ కీలక ఆటగాడని అతను పీటీఐతో మాట్లాడుతూ చెప్పాడు. అయితే, అతనిపై వచ్చిన ఆరోపణను తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశాడు. శుక్రవారం సమాఖ్య కార్యవర్గ సమావేశం జరుగుతుందని, అందులో ఒక నిర్ణయం తీసుకుంటామని సింగ్ తెలిపాడు.