క్రీడాభూమి

మియామీ ఓపెన్ టెన్నిస్ సెరెనా ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, మార్చి 22: ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొంది. గత వారం ఇండియన్ వెల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా 6-3, 6-2 తేడాతో సెరెనాపై సులభంగా గెలిచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆడ పిల్లకు జన్మనిచ్చిన ఆమె 13 నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ కెరీర్‌ను మొదలు పెట్టింది. కానీ, పూర్వ వైభవాన్ని సంపాదించుకోలేకపోతున్నది. ర్యాలీలు, సర్వీసులు, షాట్లలో ఆమె పూర్తిగా విఫలమైంది. ఒసాకాకు ఏ దశలోనూ తగిన సమాధానం ఇవ్వలేకపోయిన సెరెనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.