క్రీడాభూమి

యూఏఈ సంచలనం జింబాబ్వేపై ఊహించని విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, మార్చి 22: ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన విజయాన్ని నమోదు చేసింది. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌ని యూఏఈ మూడు పరుగుల తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 47.5 ఓవర్లలో 235 పరుగులు సాధించింది. రమీజ్ షాజాద్ 59, గులామ్ షబ్బీర్ 40 పరుగులతో రాణించగా, జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా 41 పరుగులకు మూడు, టెండై చతారా 49 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 40 ఓవర్లలో 7 వికెట్లకు 226 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, పీటర్ మూర్ 39, సికందర్ రజా 34 చొప్పున పరుగులు సాధించారు. కాగా, వర్షం కారణంగా ఆట నిలిచిపోవడంతో, యూఏఈని విజేతగా ప్రకటించారు.