క్రీడాభూమి

పీఎస్‌ఎల్ ఫైనల్‌కు భారీ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, మార్చి 23: పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షణలో ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఈనెల 25 వరకు ప్రతిష్టాత్మకమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ లీగ్‌కు సంబంధించిన మ్యాచ్‌లు యుఏఈలో జరిగాయి. ఫైనల్ మ్యాచ్ మాత్రం పేషావార్‌లో నిర్వహించనున్నది. గత తొమ్మిది సంవత్సరాల తర్వాత క్రికెట్‌లో మోగా ఈవెంట్ నిర్వహించడం ఇది ఫ్రథమం. 35 రోజుల పాటు సాగిన పీఏస్‌ఎల్ మొత్తం ఆరు జట్లు పేషావర్ జాల్మి, ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్, క్యూట్టా గ్లాడియోటర్స్, లాహోర్ కాలాన్‌దార్స్, ఇస్లామాబాద్ పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఈనెల 25వ తేదీన ఆదివారంనాడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గతంలో పీఎస్‌ఎల్ నిర్వహించినపుడు చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు పూనరావృతం కాకుండా ఉండేందుకు గాను పాకిస్తాన్ పోలీసు ఉన్నాతాధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇస్లామాబాద్ పేషావర్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు కాకుండా ఉండేందుకు పాకిస్తాన్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. వేలాది మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. 2009లో శ్రీలంక టెస్టు జట్టుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పీఎస్‌ఎల్‌లో పాల్గొనేందుకు విదేశీ క్రికెటర్‌లు అసక్తి చూపకపోవడంతో వివిధ జట్లకు సంబంధించిన ఫ్రాంచైజీలు అసక్తి మేరకు మ్యాచ్‌లను యుఏఈలో నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ మాత్రం పాకిస్తాన్‌లో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణాయించింది.