క్రీడాభూమి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో నైల్ స్థానే ఆండర్సన్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: వచ్చే నెలలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడే రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టులో స్వల్ప మార్పు జరిగింది. ఈ జట్టులోని ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ కౌల్టర్ నైల్ గాయపడిన నేపథ్యంలో అతని స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌కు కొరీ ఆండర్సన్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని ఐపీఎల్ సాంకేతిక కమిటీ శనివారం ధృవీకరించింది. కారే ఆండర్సన్ గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఆడిన సమయంలో జరిగిన ఎనిమిది మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసుకున్నాడు. అయితే, ఆ తర్వాత అను గాయపడడంతో మిగిలిన మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. గుర్తింపు పొందిన, రిజర్వులో రెడీగా ఉన్న సభ్యులు (ఆర్‌ఏపీపీ) కింద రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఆండర్సన్‌ను రెండు కోట్ల రూపాయలకు తమ జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటన ద్వార వెల్లడించింది. ఇదే విషయాన్ని సదరు జట్టు ఫ్రాంచైజీ కూడా ధృవీకరించింది. నాథన్ కౌల్టర్ నైల్ తీవ్రంగా గాయపడడంతో అతను కోలుకునేందుకు చాలాకాలం పడుతుంది. ఎంతో పరిణితి చెందిన ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందిన నైల్ రానున్న 11వ సీజన్ ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఏమాత్రం లేదు. అయితే, అతను త్వరితగతిన కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యంతో తమ జట్టులోకి పునరాగమనం చేయాలని రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం ప్రధాన కోచ్ డానియల్ వెటోరీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

చిత్రం..నాథన్ కౌల్టర్ నైల్