క్రీడాభూమి

వీడని వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోగా, పిచ్‌ని కవర్లతో కప్పి ఉంచిన దృశ్యం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 58 పరుగులకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్ ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్‌లో రెండు రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 229 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించగా, మరో నాలుగు పరుగులు జత కలిశాయి. ఈ దశలో మళ్లీ భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపేసిన అంపైర్లు, చివరికి మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 49 పరుగుల ఓవర్‌నైట్ స్కోరువద్ద బ్యాటింగ్ చేస్తున్న హెన్రీ నికోల్స్ అర్ధ శతకం పూర్తి చేశాడు. అతను 52, వాల్టింగ్ 19 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ 175 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి.