క్రీడాభూమి

షట్లర్ సింధుకు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: తెలుగు తేజం, బాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది. వచ్చేనెల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగే కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్ తరఫున ఫ్లాగ్‌బేరర్‌గా జాతీయ పతాకాన్ని పట్టుకొని మార్చ్‌పాస్ట్‌లో ముందు నడిచేందుకు భాతర ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆమెను ఎంపిక చేసింది. గత మూడు కామనె్వల్త్ గేమ్స్‌లోనూ షూటర్లకే ఈ అవకాశం దక్కగా, ఈసారి సింధును ఆ అదృష్టం వరించింది. 2006లో ప్రస్తుత కేంద్ర క్రీడాశాఖ మంత్రి, ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఫ్లాగ్‌బేరర్‌గా ఉన్నాడు. 2008లో షూటింగ్ హీరో అభినవ్ బింద్రాకు ఈ అవకాశం లభించింది. 2014లోనూ షూటర్‌నే ఐఓఏ ఫ్లాగ్‌బేరర్‌గా ఎంపిక చేసింది. అప్పుడు భారత బృందానికి విజయ్ కుమార్ మార్గదర్శనం చేశాడు. ఈసారి సింధుకు అవకాశం దక్కడం విశేషం. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఆమె 2014 కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్యాన్ని అందుకుంది. ఈసారి మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించే అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయి.