క్రీడాభూమి

ఆస్ట్రేలియా ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 28: ఇక్కడి బ్రబోర్న్ స్టేడియంలో బుధవారం జరిగిన మహిళల టీ-20 ముక్కోణపు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతోనే ఇంగ్లాండ్‌పై పరాజయాన్ని చవిచూసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎంచుకుంది. ఇంగ్లాండ్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. ప్రత్యర్థి తమ ముందుంచిన పరిమిత లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించి కేవలం 11.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో ఎవరూ ఆశించిన స్కోరు చేయకలేక చతికిలపడ్డారు. ఆస్ట్రేలియా జట్టులో డెల్సా కిమిన్స్ నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెటు తీసుకుంది. జెస్ జొనాసెన్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు, మెగాన్ స్కట్ 2.4 ఓవర్లలో 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. ఎలైసె పెర్రీ మూడు ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్, అమందా వెల్లింగ్టన్ ఒక ఓవర్‌లో రెండు పరుగులిచ్చి ఒక వికెట్, యాష్‌లీగ్ గార్డెనెర్ ఒక ఓవర్‌లో నాలుగు పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టులో వికెట్ కీపర్ అలైస్సా హీలే ఆరు పరుగులు, ఎలైసె విల్లానీ ఒక పరుగు చేసినా, ఎలైసె పెర్రీ అత్యధికంగా 47 పరుగులు, కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ జట్టులో నటాలీ సీవర్, సోఫీ ఎసెల్‌స్టోన్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ డేనియల్లీ వ్యాట్ సెంచరీ నమోదు చేయగా, బుధవారం ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్‌లో కేవలం ఆరు పరుగులకే ఔటైంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు శనివారం జరిగే ఫైనల్ పోరుకు ఇప్పటికే తమ బెర్త్‌లను ఖాయం చేసుకోగా, టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పరాజయం పాలైన విషయం తెలిసిందే.