క్రీడాభూమి

ఒర్లెన్స్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒర్లెన్స్ (ఫ్రాన్స్), మార్చి 30: ఫ్రాన్స్‌లోని ఒర్లెన్స్‌లో జరుగుతున్న ఓపెన్ వరల్డ్ సూపర్ 100 బాడ్మింటన్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్స్ కశ్యప్, సమీర్ వర్మ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ఐదో సీడ్ క్రీడాకారుడు కాశ్యప్ గత వారం ఆస్ట్రేలియాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నేడిక్కడ జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో కశ్యప్ 21-11, 21-14 స్కోరు తేడాతో ప్రత్యర్థి ఐర్లాండ్‌కు చెందిన జోషువా మ్యాగిపై విజయం సాధించాడు. స్విస్ ఒపెన్ చాంపియన్, టాప్ సీడ్ ఆటాగాడు సమీర్ వర్మ 21-16, 21-15 స్కోరు తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన థామాస్ రోక్సేల్‌పై నెగ్గాడు. శనివారం జరుగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కామనె్వల్త్ స్వర్ణపతకం విజేత కాశ్యప్, డేన్మార్క్‌కు చెందిన తృతీయ సీడ్ క్రీడాకారుడు రాస్‌మూస్ జేమ్కేతో, సమీర్ స్థానిక లోకల్ క్రీడాకారుడైన లూకాస్ కార్వీతో తలపడనున్నారు.
చిత్రం: ఆస్ట్రేలియాలో జరిగిన షూటింగ్ జూనియర్ వరల్డ్ కప్ మహిళల 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించి, శుక్రవారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న షూటర్ ఎలవెనిల్ వలారివన్. అధికారులు,
అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.