క్రీడాభూమి

ఐపీఎల్‌కు స్టార్క్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాల్సిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచల్ స్టార్క్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. కుడి కాలి గాయంతో బాధపడుతున్న అతనిని శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో మొదలైన చివరి, నాలుగో టెస్టు నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు విశ్రాంతినిచ్చారు. అతను పూర్తిగా కోలుకోలేదని, అందుకే, ఐపీఎల్‌లోనూ అతను ఆడే అవకాశం లేదని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ 9.4 కోట్ల రూపాయలు వెచ్చించి స్టార్క్‌ను తీసుకుంది. అతను అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు భారీ నష్టంగానే పేర్కోవాలి.